AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ అమీబియా కలకలం.. నెలలో ఐదుగురు మృతి వీడియో

మళ్లీ అమీబియా కలకలం.. నెలలో ఐదుగురు మృతి వీడియో

Samatha J
|

Updated on: Sep 10, 2025 | 1:28 PM

Share

కేరళలో ప్రాణాంతక వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. మనుషుల ప్రాణాలను తినేస్తోంది. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా సోకి తాజాగా మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో నెల రోజుల్లోనే ఐదో మరణం నమోదైంది. మలప్పురానికు చెందిన 56 ఏండ్ల శోభన్‌ అనే వ్యక్తి కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్టు అధికారులు ప్రకటించారు. మరో 11 మంది కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ దవాఖానలో చికిత్స పొందుతుండగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెదడును తినేసే నెగ్లేరియా ఫాలెరీ అనే అమీబా కారణంగా ప్రైమరీ అమీబిక్‌ మెనింజోఎన్‌సైఫలిటిస్‌ అనే వ్యాధి వారికి సోకిందని వైద్యులు గుర్తించారు. నెగ్లేరియా ఫాలెరీ అనే అమీబా నీటి ద్వారా సోకుతుంది. అది ముక్కు రంధ్రాల ద్వారా మెదడుకు పాకి మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ఇది చెరువులు, సరస్సులు, బావులు, నదులు మరియు క్లోరినేటెడ్ కొలనులు వంటి వెచ్చని, మంచినీటి వనరులలో, ముఖ్యంగా వేసవి లేదా వర్షాకాలంలో దాగి ఉంటుంది. తరచుగా ఈత కొట్టేటప్పుడు, స్నానం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.వ్యాధి సోకిన వారం రోజులకు గానీ ఈ వ్యాధి లక్షణాలు బయటపడవని నిపుణులు చెబుతున్నారు. దీని బారిన పడిన వారిలో.. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి చికిత్స చేసినా కోలుకోవడం చాలా కష్టమని, వారు కొన్ని రోజుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. శుద్ధి చేయని బావులు లేదా చెరువులు, నదులు లేదా సరైన క్లోరినేషన్ లేని కొలనులలో స్నానం చేయడం, ఈత కొట్టడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

జాగ్రత్త : కారు సన్‌రూఫ్‌ ఇలా వాడితే శిక్ష తప్పదంట!వీడియో

విశాఖపట్నంలో ఘనంగా మహాసిమెంట్స్‌ వార్షిక సమావేశం వీడియో

ఢిల్లీలో ఒక్కసారిగా కూలిన భవనం వీడియో

తురకపాలెం.. భయపడొద్దు.. నేనొచ్చా.. ఇక్కడే పల్లె నిద్ర చేస్తా వీడియో