ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో
దేశంలో సౌత్ టు నార్త్, ఈస్ట్ టు వెస్ట్ వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు చోట్ల కుండ పోత వానలు, క్లౌడ్ బరస్ట్‌లతో జనజీవనం అతలాకుతలం అయింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కొద్ది రోజలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంగలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది.
తెలంగాణలో పిడుగుపాటుతో ఒకే రోజు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు, గద్వాల్ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మె ఎంగ్లాపూర్‌లో పిడుగు పాటుతో ఇద్దరు రైతులు, వ్యవసాయ కూలీ మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రైతు దంపతులు ఎల్లయ్య, ఎల్లవ్వ, కూలీ బండారు వెంకటిగా గుర్తించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని సత్యనారాయణపురంలోనూ పిడుగుపడి ఒకరు చనిపోయారు. పశువులను మేపేందుకు వెళ్లిన ధారావత్ మహేష్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం మడుపల్లి గ్రామంలోనూ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి రైతు గడిపూడి వీరభద్ర రావు మృతి చెందారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం భూంపురంలో ముగ్గురు చనిపోయారు. పొలంలో పని చేసుకుంటుండగా పిడుగు పడడంతో పార్వతమ్మ, సౌభాగ్య, సర్వేశ్ మృతి చెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
బస్సులో ఫోన్ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో
అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
