AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో మరో దారుణం..భారతీయుడి తల నరికిన దుండగుడు వీడియో

అమెరికాలో మరో దారుణం..భారతీయుడి తల నరికిన దుండగుడు వీడియో

Samatha J
|

Updated on: Sep 13, 2025 | 3:12 PM

Share

అమెరికాలో అత్యంత దారుణ సంఘటన జరిగింది. కుటుంబ సభ్యుల కళ్లెదుటే.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని దుండగుడు అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. టెక్సాస్‌లోని డల్లాస్‌లో సెప్టెంబర్‌ 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేవలం ఒక చిన్న గొడవ కారణంగా ఈ ఘోరం జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… మృతుడు చంద్రమౌళి నాగమల్లయ్యగా గుర్తించారు. అతని వయస్సు 50 ఏళ్లు. డల్లాస్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్‌లో అతనిపై దాడిచేసి కత్తితో తల నరికి చంపేశారు. యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అత‌డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన మహిళా సహోద్యోగితో కలిసి మోటెల్‌లోని ఒక గదిని శుభ్రం చేస్తుండగా, చంద్రమౌళి అక్కడికి వెళ్లారు. అప్పటికే పాడైపోయిన వాషింగ్ మెషీన్‌ను ఉపయోగించవద్దని వారికి సూచించారు. అయితే, చంద్రమౌళి ఈ విషయాన్ని నేరుగా కోబోస్‌తో చెప్పకుండా, అతని పక్కనే ఉన్న మహిళా సహోద్యోగికి చెప్పడంతో కోబోస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తనను కాదని ఆమెతో మాట్లాడటాన్ని అవమానంగా భావించాడు. వెంటనే తన వద్ద దాచుకున్న కత్తిని బయటకు తీసి చంద్రమౌళిపై దాడికి తెగబడ్డాడు. ప్రాణభయంతో చంద్రమౌళి మోటెల్ పార్కింగ్ స్థలంలోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా నిందితుడు అతన్ని వెంటాడి, కిరాతకంగా దాడి చేశాడు.

మరిన్ని వీడియోల కోసం :

ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో

ఎండ ఉన్నంతసేపు ఉరుకతనే ఉంటది..కాకినాడ కుర్రోడి ఖతర్నాక్‌ ఐడియా వీడియో

ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు జాగ్రత్త.. వీడియో

హైదరాబాద్‌ నుంచి 3 హై స్పీడ్ రైలు మార్గాలు వీడియో