ట్రంప్ డబుల్ గేమ్..పైకి ప్రేమ.. లోపల ద్వేషం వీడియో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియా విషయంలో మెత్తబడ్డారా? లేక డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఒకవైపు.. భారత్‌పై తాము విధించిన సుంకాలు ఎక్కువే అని బాధ పడుతున్నట్లు నటిస్తూనే.. మరోవైపు మీరు కూడా ఓ చూపు చూడండి అంటూ యూరోపియన్ యూనియన్‌లోని దేశాలకు తనదైన శైలిలో రెచ్చగొడుతున్నాడు.
తాజాగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్ పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తించింది. అమెరికా -భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని..ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు చేశారు ట్రంప్.. 50శాతం సుంకాలతో ఇండియాను టార్గెట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ..రోజుకో రూపం చూపిస్తున్నారు. చిత్ర విచిత్ర వేషాలతో, మాటలతో అయోమయంలో పడేస్తున్నారు. ట్రంప్ తాజా పోస్టుకు భారత్.. సానుకూలంగా స్పందించింది. ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ.. అమెరికా-భారత్ సహజ సిద్ధమైన, గాఢమైన మిత్రులని కామెంట్ చేశారు. కానీ, ఇది జరిగిన కాసేపటికే ట్రంప్ తన బుద్దిని చూపించారు. భారత్ , చైనాలపై 100శాతం సుంకాలను విధించాలని యురోపియన్ యూనియన్‌ను ట్రంప్ కోరినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే..భారత్, చైనాలపై భారీగా సుంకాలు వేసి.. ఆ దేశాలను కట్టడి చేయటం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే , బారత్ – చైనాలపై వందశాతం సుంకాలను విధించాలని యూరోపియన్ యూనియన్‌కు ట్రంప్ సూచించినట్లు సమాచారం.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
బస్సులో ఫోన్ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో
అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు
