Weather Alert: బిగ్ అలర్ట్..! హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్..?
తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవల్ వంతెనలపైనా నీళ్లు చేరడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో కొన్నిరోజులుగా కామ్‌గా ఉన్న వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పలు జిల్లాల్లో మళ్లీ కుండపోత మొదలైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. లోలెవల్ వంతెనలపైనా నీళ్లు చేరడంతో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇటు హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతోంది. రాబోయే గంటల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే రెండు గంటల్లో ఎల్‌బీ నగర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో చార్మినార్, రాజేంద్రనగర్, సరూరునగర్, బాలాపూర్, వనస్థలిపురం, హయత్‌నగర్, ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.
ఇప్పటివరకు కూకట్‌పల్లి, బాలానగర్, మియాపూర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బేగంపేట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. మరోవైపు అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కాప్రా, ఈసిఐఎల్, నేరేడ్‌మెట్, మౌలాలి, నాగారం, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్ర ఈదురుగాలులు, భారీ వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.
మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం వచ్చే రెండు గంటలపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు పడుతున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు మరో నాలుగు రోజులపాటు కొనసాగుతాయంటున్నారు అధికారులు. ఎగువ నుంచి వస్తున్న వరదలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. 15 గేట్లు ఎత్తి ఉస్మాన్ సాగర్ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
