AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: 110 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న బామ్మ.. 4 తరాల పిల్లలతో గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్..

ఆమెకు 110 ఏళ్లు. అయినా యాక్టివ్‌గా తన పనులు తనే చేసుకుంటుంది. తన కుటుంబంలోని 4 తరాలను చూసింది. ఈ క్రమంలో బామ్మ 110వ బర్త్ డే వేడుకలను కుటుంబసభ్యులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. బామ్మ ఆరోగ్యానికి రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఆమె ఆహారపు అలవాట్లను, జీవనశైలిని తెలుసుకుంటున్నారు.

Telangana: 110 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న బామ్మ.. 4 తరాల పిల్లలతో గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్..
Old Woman Celebrates 110th Birthday
G Sampath Kumar
| Edited By: |

Updated on: Sep 13, 2025 | 2:03 PM

Share

ఈ రోజుల్లో 60 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ అంటూ ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారే ఎక్కువ. కానీ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ బామ్మ 110 ఏళ్ల వయస్సులోనూ ఎంతో యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. తన పనులన్నీ తానే చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పోచమ్మ 110వ జన్మదిన వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ భర్త మైసయ్య 40 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఐదుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మొత్తం 42 మంది మనుమలు, మనుమరాళ్లతో కలిపి ఈ బామ్మ ఏకంగా నాలుగు తరాలను చూశారు.

110 సంవత్సరాల వయస్సులో కూడా పోచమ్మ యాక్టివ్‌గా ఉన్నారు. తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ ఆరోగ్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈమె మనుమలు, మనుమరాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. ఈమె మాత్రం ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండడం విశేషం. 110వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి, పోచమ్మను శాలువాతో సత్కరించారు. అందరూ కలిసి విందు భోజనాలు చేసి.. ఈ అరుదైన పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్నారు. పోచమ్మ ఆరోగ్యానికి రహస్యం ఏంటో తెలుసుకోవడానికి ఆమె ఆహారపు అలవాట్లను, జీవనశైలిని తెలుసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..