Caste Certificate: నో క్యూ.. నో వెయిటింగ్ ఇకపై మరింత ఈజీగా క్యాస్ట్ సర్టిఫికెట్స్
తెలంగాణలో క్యాస్ట్ సర్టిఫికెట్‌లను పొందే విధానంలో పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఇకపై బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలకు ఈ సర్టిఫికెట్లు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే కొత్త ప్రక్రియను ప్రారంభించింది.
ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఎమ్మర్వో ఆమోదం వచ్చిన తరువాతే సర్టిఫికేట్ అందేది. ఎమ్మార్వో అందుబాటులో లేకపోతే వారం, పదిరోజులు లేదా రెండు వారాలు ఆలస్యం అయ్యేది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రభుత్వం ఈ జాప్యాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో మీ సేవ విభాగం, సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ శాఖలు, జిల్లా అధికారులు, తహసీల్దార్‌లు కలిసి కొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. గత 15 రోజులుగా ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను ఉపయోగించుకున్నారు. మీ దగ్గర పాత కుల ధ్రువీకరణ పత్రం నంబర్ ఉంటే మరింత సులభంగా క్యాస్ట్ సర్టిఫికెట్ లభిస్తుంది. దగ్గర్లోని మీ సేవ సెంటర్‌లో కౌంటర్‌కు వెళ్లి పాత సర్టిఫికెట్ నంబర్ చెబితే వెంటనే కొత్త ప్రింటౌట్ పొందవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. ఒకవేళ మీకు పాత ధ్రువీకరణ నంబర్ గుర్తు లేకపోయినా మీ సేవ సెంటర్‌లో మీ జిల్లా, మండలం, గ్రామం, ఉపకులం, పేరు ఆధారంగా మీ రికార్డును వెతికి ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. ఈ కొత్త మార్పులు ప్రజలకు భారీగా ఉపశమనం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపై ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నమాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!
ఆ దేశాలకు ఇవి తీసుకెళుతున్నారా? అయితే జైలే
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..
RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్ లాక్! ఆర్బీఐ కొత్త రూల్
Telangana Rains: కొన్నిచోట్ల క్లౌడ్ బరస్ట్ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

