AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్‌ లాక్‌! ఆర్బీఐ కొత్త రూల్‌

RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్‌ లాక్‌! ఆర్బీఐ కొత్త రూల్‌

Phani CH
|

Updated on: Sep 13, 2025 | 1:17 PM

Share

ఈఎంఐ మీద మీరు మొబైల్‌ కొన్నారా? అయితే ఈ న్యూస్‌ మీ కోసమే. ఈఎంఐలో ఫోన్లు కొనుగోలు చేసి బకాయిలు కట్టకపోతే ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌ లాక్‌ అయిపోతుంది. ఈఎంఐ కట్టని వారి ఫోన్లను దూరం నుంచే లాక్‌ చేసేందుకు రుణసంస్థలకు అనుమతి ఇవ్వాలని ఆర్బీఐ యోచిస్తోంది. మొండి బకాయిలను తగ్గించే లక్ష్యంతో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు అధికారిక‌ వర్గాలు తెలిపాయి.

దేశంలో చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్నవారు ఎక్కువగా ఎగవేతలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ఆర్బీఐ ఈ చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఈ విధానాన్ని అనుసరించాయి. అయితే గతేడాది దానిని ఆర్బీఐ నిలిపివేసింది. ఇప్పుడు రుణ సంస్థలతో సంప్రదింపులు జరిపి, పటిష్ఠమైన నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను తన ‘ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్’లో చేర్చనుంది. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ కొత్త నిబంధనలు వెలువడే అవకాశం ఉంది. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం, రుణం ఇచ్చే సమయంలోనే ఫోన్‌ను లాక్ చేసే అవకాశంపై వినియోగదారుడి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే, ఫోన్‌ను లాక్ చేసినప్పటికీ, అందులోని వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేసే అధికారం రుణ సంస్థలకు ఉండదు. “వినియోగదారుల డేటాకు రక్షణ కల్పిస్తూనే, రుణాల రికవరీకి వీలు కల్పించడమే తమ ఉద్దేశం” అని ఒక అధికారి తెలిపారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కొన్ని ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రూ. లక్షలోపు రుణాల్లో ఎగవేతలు ఎక్కువగా ఉన్నాయని, ఈ విధానం ద్వారా రికవరీలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. 2024 నాటి ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో అమ్ముడయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మూడింట ఒక వంతు చిన్న రుణాల ద్వారానే జరుగుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana Rains: కొన్నిచోట్ల క్లౌడ్‌ బరస్ట్‌ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

ICUలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. చలించిపోయిన మనోజ్.. సాయం కోసం రిక్వెస్ట్

Raghava Lawrence: పేద విద్యార్థులకు పాఠశాలగా సొంత ఇల్లు.. సేవా గుణంలో.. రారాజుగా లారెన్స్

Rithu Chowdary: రీతూ పాపకి.. బిగ్ బాస్ భారీ నజరానా ??

Natural Star Nani: అరెరే.. నానికి భలే ఛాన్స్ మిస్ అయిందే