ICUలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. చలించిపోయిన మనోజ్.. సాయం కోసం రిక్వెస్ట్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఠక్కున స్పందిస్తాడు. నేనున్నానంటూ అండగా నిలబడతాడు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యాడు. ‘ధైర్యంగా ఉండు తమ్ముడు. మేమంతా నీతోనే ఉన్నాం. లవ్‌యూ. నీ నంబర్ పంపించు’ అని మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
తాజాగా మంచు వారబ్బాయి సోషల్ మీడియా వేదికగా మరో విజ్ఞప్తి చేశాడు. 100కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన ఒక టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడని, ఈ సమయంలో మనమంతా అతనికి అండగా నిలవాలని కోరారు. ఆ కుటుంబానికి అండగా నిలిచి మన ప్రేమ, మద్దతు తెలపాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడికి సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా షేర్ చేశాడు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది సినీ అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన సాయం చేస్తున్నారు. వెంకీ’ సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్‌గా నటించి ఆకట్టుకున్న కమెడియన్ రామచంద్ర ఇప్పుడు పూర్తిగా దీన స్థితిలో ఉన్నాడు. పక్షవాతం కారణంగా ప్రస్తుతం అతను మంచం పైనుంచి కదల్లేని స్థితిలో ఉన్నాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని, తమ్ముడే తన బాగోగులు చూసుకుంటున్నాడని రామచంద్ర ఇటీవలే వెల్లడించాడు. రామ చంద్ర గురించి తెలుసుకున్న మంచు మనోజ్ ఇటీవలే అతని ఇంటికెళ్లాడు. నటుడిని పరామర్శించాడు. అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి రామ చంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ అతనిని ఆదుకోవాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఇటీవలే ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ కూడా రామ చంద్ర వైద్య చికిత్సల కోసం రూ.25,000 ఆర్థిక సాయం అందజేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raghava Lawrence: పేద విద్యార్థులకు పాఠశాలగా సొంత ఇల్లు.. సేవా గుణంలో.. రారాజుగా లారెన్స్
Rithu Chowdary: రీతూ పాపకి.. బిగ్ బాస్ భారీ నజరానా ??
Natural Star Nani: అరెరే.. నానికి భలే ఛాన్స్ మిస్ అయిందే
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

