హెచ్-1బీ వీసాలపై వెనక్కి తగ్గిన ఇండియన్ ఐటీ
అమెరికాలో హెచ్-1బీ వీసాల జారీపై తరచూ చర్చ జరుగుతున్న వేళ, ఆసక్తికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ వీసాలను అత్యధికంగా వినియోగించుకున్న భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీలు ఇప్పుడు భారీగా తగ్గించాయి. మరోవైపు, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలే ఇప్పుడు హెచ్-1బీ వీసాలను ఎక్కువగా పొందుతున్నాయి.
ఈ మార్పు గత ఎనిమిదేళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) నివేదిక వెల్లడించింది. NFAP గణాంకాల ప్రకారం, ఏడు ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాల కోసం సమర్పించే దరఖాస్తుల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. 2015లో ఈ కంపెనీలు సుమారు 15,100 దరఖాస్తులు చేయగా, 2022-23 నాటికి ఆ సంఖ్య కేవలం 6,700కు పడిపోయింది. అంటే, గత ఎనిమిది సంవత్సరాలలో దరఖాస్తులు ఏకంగా 56 శాతం తగ్గాయి. ఒకప్పుడు హెచ్-1బీ వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసిన ఓ ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ, ఇదే కాలంలో తన వీసా ఆమోదాలను 75 శాతం వరకు తగ్గించుకోవడం గమనార్హం. ఇది భారతీయ కంపెనీల వ్యూహంలో వచ్చిన మార్పును సూచిస్తోంది. దీనికి పూర్తి భిన్నంగా, అమెరికన్ టెక్ కంపెనీలు హెచ్-1బీ వీసాలను పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు ప్రముఖ అమెరికన్ ఐటీ కంపెనీలే దాదాపు 28,000 హెచ్-1బీ వీసా ఆమోదాలు పొందాయని నివేదిక పేర్కొంది. విదేశీయులు తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ గణాంకాలు హెచ్-1బీ వీసాల వినియోగంలో అసలు ట్రెండ్‌ను స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల శ్రీవారికి అలంకరించే పూల మాలల ప్రత్యేకత ఏంటో తెలుసా?
Gold Loans: గోల్డ్ రేట్ ఎఫెక్ట్.. రూ.3 లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్స్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

