AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!

ప్రపంచ యాత్రకు మహిళా సాహసికులు!

Phani CH
|

Updated on: Sep 13, 2025 | 1:49 PM

Share

భారత త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం చేశారు. ఈ చరిత్రాత్మక నౌకా యాత్రను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందం సముద్రంలో 26 వేల నాటికల్‌ మైళ్లు ప్రయాణించనుంది.

రెండుసార్లు భూమధ్యరేఖను దాటనుంది, అత్యంత ప్రమాదకరంగా చెప్పుకునే మూడు గ్రేట్‌ కేప్‌లను ఈ బృందం చుట్టి రానుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రేక్‌ పాసేజ్‌ జలాల్లో వీరి ప్రయాణం సాగుతుంది. ఈ బృందం 2026 మే నెలలో తిరిగి ముంబై తీరానికి చేరుకుంటుందని అంచనా. గత మూడేళ్లుగా ఈ బృందం కఠిన శిక్షణ పొందింది. శిక్షణలో భాగంగా ముంబై నుంచి సుదూర సీషెల్స్‌ వరకు సముద్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి తమ సన్నద్ధతను బృందం ఇప్పటికే చాటుకుంది. ఐఎన్‌ఎస్‌ త్రివేణి నౌక ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సంకల్పానికి ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఇటీవల ఐఎన్‌ఎస్‌ తారిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన లెఫ్టినెంట్‌ కమాండర్లు దిల్నా, రూపాలను అభినందించారు. ఇప్పుడు ‘త్రివేణి’ బృందం కూడా నౌకాయానంలో మరో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ దేశాలకు ఇవి తీసుకెళుతున్నారా? అయితే జైలే

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే..

RBI NEW RULE : ఈఎంఐ కట్టకపోతే మీ ఫోన్‌ లాక్‌! ఆర్బీఐ కొత్త రూల్‌

Telangana Rains: కొన్నిచోట్ల క్లౌడ్‌ బరస్ట్‌ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

ICUలో టాలీవుడ్ ఫేమస్ కమెడియన్.. చలించిపోయిన మనోజ్.. సాయం కోసం రిక్వెస్ట్