AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఆ జిల్లాల మీదుగా జర్నీ.

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకుపోతున్నాయి. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ, వేగంతోపాటు, అధునాతన సదుపాయాలను అందిస్తున్నాయి. అందుకే ధర కాస్త ఎక్కువ అయినా వందే భారత్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో దాదాపు అన్ని రూట్స్‌లో...

Vande Bharat: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఆ జిల్లాల మీదుగా జర్నీ.
Vande Bharat Train
Narender Vaitla
|

Updated on: Jun 24, 2023 | 3:12 PM

Share

భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మారుస్తూ అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకుపోతున్నాయి. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తూ, వేగంతోపాటు, అధునాతన సదుపాయాలను అందిస్తున్నాయి. అందుకే ధర కాస్త ఎక్కువ అయినా వందే భారత్‌ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో దాదాపు అన్ని రూట్స్‌లో వందే భారత్‌ రైళ్లను విస్తరింపజేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైళ్లను ప్రారంభిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందేభారత్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఒకటి, సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు మరో రైలు సేవలు అందిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో మరో వందే భారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. తెలంగాణ, మహారాష్ట్రాలను కలుపుతూ ఈ కొత్త వందే భారత్‌ సర్వీసు ప్రారంభంకానుంది. సికింద్రాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌ వరకు వందే భారత్‌ రైలు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణ సమయం 10 గంటలు పడుతోంది. అయితే వందే భారత్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 4 గంటలు తగ్గనుంది. 6 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

ఇక ఈ రైలు తెలంగాణలోని కాజీపేటీ, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, సిర్పూర్ స్టేషన్స్‌లో ఆగనుంది. ఇప్పటికే ట్రయల్‌ రన్‌ను నిర్వహించిన అధికారులు త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు దేశంలో 18 మార్గాల్లో ఈ రైళ్లను నడిపిస్తుండగా ఇది 19వ మార్గం కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్