Hyderabad: కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్.. మహిళా ఐపీఎస్‌కు మెసేజ్‌లు.. చివరకు ఏం జరిగిందంటే..
NRI Arrest: సామాన్య మహిళలకే కాదు, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌కు కూడా వేధింపులు తప్పలేదు. ఓ పోకిరి ఏకంగా ఐపీఎస్ అధికారిణికే అసభ్యకర మెసేజ్‌లు పంపాడు.
NRI Arrest: సామాన్య మహిళలకే కాదు, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌కు కూడా వేధింపులు తప్పలేదు. ఓ పోకిరి ఏకంగా ఐపీఎస్ అధికారిణికే అసభ్యకర మెసేజ్‌లు పంపాడు. ఆమె ఉంటోన్న ప్లేస్‌కి వచ్చి వేధింపులకు దిగాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఇన్సిడెంట్ హైదరాబాద్‌లో జరిగింది.
ఆ పోకిరి పేరు ఘల్‌రాజు. కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈ ఎన్నారై అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్. యూఎస్‌ఏలో ఉంటోన్న ఘల్‌రాజు.. కొన్నాళ్లుగా ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి వెంటపడుతూ వేధించాడు. నిత్యం అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ నరకం చూపించాడు. ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌ది పంజాబ్ కావడం.. ఘల్‌రాజుది కూడా సేమ్ స్టేట్ కావడంతో.. అమెరికా నుంచి పంజాబ్‌కి వచ్చిన ఈ ఎన్నారై, వేధింపులను మరింత పెంచాడు. అసభ్యకర మెసేజ్‌లు పంపుతూ వేధించడమే కాకుండా, ఆమె కదలికలపైనే నిఘాపెట్టాడు ఈ ప్రబుద్ధుడు. ఆ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడకెళ్తే అక్కడకి వెళ్లడం, వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
హైదరాబాద్ MCRHRDలో శిక్షణ తీసుకుంటోందని తెలుసుకున్న ఘల్‌రాజు, అక్కడికి కూడా వచ్చేశాడు. ఏకంగా HRD కార్యాలయంలోకే ప్రవేశించి, మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌పై వేధింపులకు దిగాడు. అప్పటివరకూ మెసేజ్‌లు మాత్రమే పెట్టడంతో లైట్ తీసుకున్న ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్.. ఏకంగా తన ముందుకే వచ్చి, వేధింపులకు దిగడంతో షాకైంది. ఊహించని పరిణామం నుంచి తేరుకుని, జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు.. ఆ పోకిరి ఎన్నారై ఆటకట్టించారు. ఘల్‌రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
అయితే, అమెరికాలో ఉంటూ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్‌కు మెసేజ్‌లు పంపిన ఘల్‌రాజు, ఏకంగా హైదరాబాద్ MCRHRD కార్యాలయంలోకే రావడం తీవ్ర కలకలం రేపింది. ఆమె, ఓ ఐపీఎస్ అని ఘల్‌రాజుకి తెలియదా? లేక, ఎవడో పోకిరీ అని, ఆ లేడీ ఆఫీసర్.. వాడిని లైట్ తీసుకోవడంతో ఇంత బరితెగించాడా? తేలాల్సి ఉంది.