AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోనూ ఎన్నార్సీ.. రెడీ కానున్న పాత బస్తీ !

అస్సాం తరహాలోనే తెలంగాణలోనూ జాతీయ జనాభా లెక్కల సేకరణ (ఎన్నార్సీ) ని చేపట్టనున్నారు. వచ్ఛే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అస్సాంలో విదేశీయులను, అక్రమ వలసదారులను గుర్తించి వారిని వారివారి స్వస్థలాలకు పంపివేసేందుకు ఆరాష్ట్రంలో ఇటీవల ఎన్నార్సీని చేబట్టిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణాలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలవుతున్నాయని తెలిసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ముస్లిం యువకులు బృందాలుగా […]

తెలంగాణలోనూ ఎన్నార్సీ.. రెడీ కానున్న పాత బస్తీ !
Anil kumar poka
|

Updated on: Sep 03, 2019 | 12:11 PM

Share

అస్సాం తరహాలోనే తెలంగాణలోనూ జాతీయ జనాభా లెక్కల సేకరణ (ఎన్నార్సీ) ని చేపట్టనున్నారు. వచ్ఛే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. అస్సాంలో విదేశీయులను, అక్రమ వలసదారులను గుర్తించి వారిని వారివారి స్వస్థలాలకు పంపివేసేందుకు ఆరాష్ట్రంలో ఇటీవల ఎన్నార్సీని చేబట్టిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణాలో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలవుతున్నాయని తెలిసింది. ఇందులో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ముస్లిం యువకులు బృందాలుగా ఏర్పడి.. తమ తమ ప్రాంతాల ప్రజలు సంబంధిత డాక్యుమెంట్లనన్నింటికీ సిధ్ధంగా ఉంచుకునేలా చూడాలని కోరనున్నారు. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్ బుక్, కరెంట్ బిల్లు వంటివాటిని రెడీగా ఉంచుకోవడమే కాక, అవి ఏ మాత్రం చిరిగి ఉండకూడదని అంటున్నారు. అలాగే అవి మడిచి ఉండరాదు.

ఆ డాక్యుమెంట్లపై ఏదైనా రాసి ఉండరాదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే అవి చెల్లుబాటు కావు. ప్రజలు మొత్తం 14 డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుందని, ప్రభుత్వ అధికారులు వీటిని తనిఖీ చేసి తమ రిజిస్టర్లలో నమోదు చేయనున్నారని సమాచారం. చాంద్రాయణగుట్ట, సిక్ కీ చౌహానీ వంటి ప్రాంతాల్లో రోహింగ్యా ముస్లిములు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వీరి విషయంలో అధికారులు మరింత జాగరూకతతో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్లే ఉర్దూలో అప్పుడే సంబంధిత ఫారాలను పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది కూడా. మైనారిటీ ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు చేబడుతున్నారని తెలుస్తోంది. రోజువారీ వేతన కూలీల డాక్యుమెంట్లను ప్రభుత్వేతర సంస్థలు పరిశీలించి సిధ్దంగా ఉంచనున్నాయి.

తమ డాక్యుమెంట్లు ఏమాత్రం పాడైపోయి ఉన్నా వాటిని అధికారులు తిరస్కరిస్తారని ముస్లిం వర్గాలు భయపడుతున్నాయి. అస్సాంలో ఎన్నార్సీ సందర్భంగా పని చేసి తమ ఫారాలను నింపడంలో సుమారు మూడున్నర లక్షల మందికి సహాయపడిన నిజాముద్దీన్ ఫారూఖీ.. ఇక్కడి సిటిజన్స్ అప్రమత్తంగానే ఉన్నారని అంటున్నారు. కానీ ఎన్నార్సీ అంచనా ప్రకారం కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు తలెత్తవచ్ఛునని ఆయన అభిప్రాయపడ్డారు. సరిగా లేని పత్రాల వల్ల కొందరిని అనర్హులుగా పరిగణించి వారి పేర్లను జాబితాలో చేర్చక పోవచ్ఛునని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ఇప్పటినుంచే వీరంతా జాగ్రత్త పడాలని ఆయన సూచిస్తున్నారు. డాక్యుమెంట్లను అత్యంత భద్రంగా ఉంచుకోవాలన్నది ఆయన ప్రధాన సూచన. ఎన్నార్సీ ప్రారంభించేంతవరకు వేచి ఉండకూడదని నిజాముద్దీన్ చెబుతున్నారు. కొందరు అధికారులు కఠినంగా వ్యవహరించవచ్ఛు.. ప్లీజ్ బీ అలర్ట్ అంటున్నారు.

అస్సాంలో ఎన్నార్సీ సందర్భంగా సమాజం నుంచి ఇల్లీగల్ వలసదారులకు పెద్దగా సహకారం లభించలేదని తెలుస్తోంది. అలాంటిది తెలంగాణాలో రిపీట్ కాకుండా చూడాలని అధికారులు సైతం కోరుతున్నారు.ఈ కారణంగానే కొన్ని ప్రభుత్వేతర, స్వచ్చంద, ధార్మిక సంస్థలు మైనారిటీలకు సహాయపడేందుకు ఉద్యుక్తమవుతున్నాయి. అసోంలో 19 లక్షల మందికి పైగా అనర్హులుగా ప్రకటించారు. అయితే వారు ట్రిబ్యునల్ లేదా కోర్టులను ఆశ్రయించవచ్ఛు. అక్కడి ఫైనల్ డ్రాఫ్ట్ కోసం 3. 3 కోట్ల మంది దరఖాస్తు పెట్టుకోగా మూడు కోట్లమందికి పైగా పేర్లను జాబితాలో చేర్చారు. మరి-తెలంగాణాలో ఇలాంటి ప్రక్రియ నిర్వహించినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.