సతీష్‌‌ కేసులో పురోగతి.. హంతకుడు దొరికేశాడు

సతీష్‌‌ కేసులో పురోగతి.. హంతకుడు దొరికేశాడు

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు హేమంత్ లొంగిపోయాడు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను హైదరాబాద్‌ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను తానే హత్య చేసినట్లు హేమంత్ పోలీసులకు వెల్లడించాడు. ఇక ఈ హత్యతో తన ప్రియురాలుకు ఎలాంటి సంబంధం లేదని అతడు వెల్లడించాడు. ఈ సందర్భంగా హేమంత్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. అయితే విదేశాల్లో ఎంఎస్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 03, 2019 | 8:53 AM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ హత్య కేసులో ఎట్టకేలకు నిందితుడు హేమంత్ లొంగిపోయాడు. చిన్ననాటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సతీష్ బాబును నమ్మించి దారుణంగా హత్య చేసిన హేమంత్‌ను హైదరాబాద్‌ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌ను తానే హత్య చేసినట్లు హేమంత్ పోలీసులకు వెల్లడించాడు. ఇక ఈ హత్యతో తన ప్రియురాలుకు ఎలాంటి సంబంధం లేదని అతడు వెల్లడించాడు. ఈ సందర్భంగా హేమంత్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.

అయితే విదేశాల్లో ఎంఎస్ పూర్తి చేసిన సతీష్ బాబు ఐటీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుండేవాడు. పలు కోచింగ్ సెంటర్‌లలో విద్యార్థులకు క్లాస్‌లు చెప్పడంతో పాటు కన్సల్టెన్సీని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో స్నేహితుడైన హేమంత్‌ను భాగస్వామిగా చేసుకున్నాడు. క్లాస్ వర్క్‌లో సతీష్.. ట్రైనింగ్ వర్క్‌లో హేమంత్ కలిసి పనిచేశారు. ఈ క్రమంలో ప్రియాంక అనే విద్యార్థినికి సతీష్ తరగతులు బోధించగా హేమంత్ ట్రైనింగ్ ఇచ్చాడు. దీంతో ఇద్దరితో ప్రియాంక స్నేహంగా, చనువుగా ఉండేది. అయితే ప్రియాంకతో హేమంత్ వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఆమె కోసం ఏకంగా తన కుటుంబాన్ని దూరంగా పెట్టి.. ఆఫీసు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా సతీష్‌తో ప్రియాంక చనువుగా ఉండటాన్ని గుర్తించిన హేమంత్.. కోపం పెంచుకుని ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్థిక లావాదేవీలే సతీష్ హత్యకు కారణమని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu