Telangana: ఇల్లందు అవిశ్వాసంలో హైడ్రామా.. అంతా కాంగ్రెస్ పనే అంటోన్న బీఆర్‌ఎస్
సీపీఐ కు చెందిన ఒక కౌన్సిలర్‌ను ఆ పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకు వెళ్లారు. అయితే మరో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను సమావేశానికి వెళ్లకుండా బయటకు తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది...

ఇల్లందు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసం ప్రత్యేక సమావేశానికి 17 మంది హాజరు కావాల్సి ఉండగా.. 15 మంది కౌన్సిలర్స్ హాజరయ్యారు. కోరం లేక పోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. ఇల్లందు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది.
సీపీఐ కు చెందిన ఒక కౌన్సిలర్‌ను ఆ పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి తీసుకు వెళ్లారు. అయితే మరో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను సమావేశానికి వెళ్లకుండా బయటకు తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇల్లందు కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాల పాటి వెంకటేశ్వర రావు పై బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్స్ ఉండగా. ఈ రోజు జరిగిన ప్రత్యేక సమావేశంకు కోరం ఉండాలంటే 17 మంది హాజరు కావాల్సి ఉంది. అయితే 16 మంది కౌన్సిలర్స్ సమావేశం జరిగే హాల్‌లోకి చేరుకున్నారు. కొద్ది సేపటికే సీపీఐ కౌన్సిలర్స్‌ను ఆ పార్టీ నేతలు వచ్చి.. హై డ్రామా మధ్య తీసుకుని వెళ్లారు. మరో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ కొక్కుల నాగేశ్వర రావును లోపలికి వెళ్లకుండా గేట్ వద్ద బీఆర్‌ఎస్,కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు.
గేట్ వద్ద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆ పార్టీ శ్రేణులు బయటకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అనుసరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం , తోపులాట జరిగింది. అతన్ని హై డ్రామా మధ్య గోడ నుంచి దూకి బయటకు తరలించారు.. సమావేశంకు 15 మంది మాత్రమే కౌన్సిలర్స్ హాజరు కావడంతో కోరం లేదు.. దీంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి లక్ష్మీ , కుమార్తె బైఠాయించారు. తన భర్తను తనకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య తన భర్తను కిడ్నాప్ చేశారని, ఆయనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిచంఆరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేశారని, మరొకసారి సమావేశానికి అవకాశం కల్పించాలని ఆమె కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




