Actor Nithiin: ‘నితిన్‌కు అంత సీన్ లేదు’.. హీరో పొలిటికల్ ఎంట్రీ పై మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కామెంట్స్..
టాలీవుడ్ హీరో నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఆయన నిజమాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వస్తున్న వార్తల పై మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి స్పందించారు.

టాలీవుడ్ హీరో నితిన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో ఆయన నిజమాబాద్ జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారనే రూమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ.. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వస్తున్న వార్తల పై మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి స్పందించారు. నితిన్‌కు అంత సీన్ లేదని.. కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారని.. టీవీల్లో వస్తున్న వార్తలను తాను నమ్మనని అన్నారు.
” నేను ఆ వార్తను టీవీలోనే చూసాను. హీరో నితిన్‌కు అంత సీన్ లేదు. అతను కాంగ్రెస్ పార్టీలో చేరడం అవాస్తవం. ఇవి సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న స్టెంట్స్లా ఉన్నాయి. అవి సినిమాల్లో పని చేస్తాయి తప్ప రాజకీయాల్లో కాదు. నితిన్‌ను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్ అనుకుంటున్నారు కాని అది సెట్ అవదు. సినిమాల్లో సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాము. ప్రజల్లో ఉన్న వారికే రాజకీయాలు వర్కవుట్ అవుతాయి. రూరల్‌లో ప్రజల్లో ఉన్న వారికే ప్రజలు పట్టం కడుతారు. నేను ఘర్ వాపసీ ద్వారానే మల్లి కాంగ్రెస్ లోకి వచ్చాను. మండవ నా గురువు లాంటి వారు. నా చేరిక చంద్రబాబు , మండవ ఇన్వాల్వ్ కాలేదు” అని అన్నారు. .




నిజామాబాద్ జిల్లాలో నితిన్ బంధువులు కొందరు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దీంతో నితిన్ సైతం రాజకీయ ఎంట్రీపై ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. గతంలోనూ నితిన్ రాజకీయ ప్రవేశం గురించి వార్తలు షికారు చేశాయి. అప్పట్లో ఆయనను పలు పార్టీ నేతలు కలిసి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది.