Alleti Maheshwar Reddy: నిర్మల్ నియోజకవర్గంలో వాట్సాప్ స్టేటస్ పాలిటిక్స్.. పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఫైర్
నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఎల్లుండి బీజేపీలో చేరుతున్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల వాట్సాప్..

నిర్మల్ కాంగ్రెస్‌లో కొత్త ఫైట్ మొదలైంది. వాట్సాప్ స్టేటస్ పాలిటిక్స్ రచ్చ షురు అయ్యింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఎల్లుండి బీజేపీలో చేరుతున్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల వాట్సాప్ స్టేటస్ వార్ నడుస్తోంది. అయితే ఈ సోషల్ మీడియా ప్రచారంపై మహేశ్వర్ రెడ్డి సీరియస్ అయ్యారు. తనపై కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు మహేశ్వర్ రెడ్డి. కొంతకాలంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఇప్పుడు మధ్య కాంగ్రెస్ నేత పేరు రావడంతో మరింత రచ్చ రచ్చగా మారుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జరిగినప్పటి నుంచి ఈ దూకుడు మరింత దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సత్తా చాటడానికి అపసోపాలు పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అడపాదడపా, చిన్నాచితక కార్యక్రమాలు చేపట్టడానికే పరిమితమైంది.
ఇదిలావుంటే, నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరింత కన్ఫ్యూజన్‌గా మారింది. సొంత పార్టీపై అధికార బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన శ్రీహరిరావు బహిరంగంగానే విమర్శలు చేస్తూండటంతో.. పార్టీని వీడబోతున్నారనే ప్రచారం సాగుతోంది. అవసరమైతే శ్రీహరిరావు బీజేపీ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
అలాగే మరో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత సత్యనారాయణగౌడ్ కూడా టచ్ మి నాట్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా ఈ సారి బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే గుసగుజలు కూడా వినిపిస్తున్నాయి. వీరిద్దరితో పాటు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, అప్పాల గణేష్ చక్రవర్తిలు సైతం పోటీకి వెనకాడేది లేదన్న సంకేతాలు అందిస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రచారం తెరమీదికి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం