Hyderabad: దేవుడు కలలో కనిపించి చెప్పాడని.. ఈ మహిళ ఎంత పని చేసిందంటే.?
దేవుడు కలలో కనిపించి చెప్పాడంటూ ఓ మహిళ చేయకూడని పని చేసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది.
దేవుడు కలలో కనిపించి చెప్పాడంటూ ఓ మహిళ చేయకూడని పని చేసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం సదరు మహిళ విషమంగా ఉంది. ఇంతకీ ఆ ఘటన ఏంటి.? అసలు ఏం జరిగిందంటే..?
వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌లో శివాని(35) అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ తన జీవనాన్ని సాగిస్తోంది. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం శివానిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. దేవుడు చెప్పాడని శివాని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు తెలిపారు.