AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లింట విషాదం.. వివాహమైన వారం రోజులకే.. విగత జీవిగా నవవధువు

జీవితంలో పెళ్లి(Marriage) అనేది అత్యంత విశేషమైనది. ఇరువురిని మాత్రమే కాకుండా.. రెండు కుటుంబాలను ఒక్కటి చేసేదే పెళ్లి. అందుకే వివాహానికి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు..

పెళ్లింట విషాదం.. వివాహమైన వారం రోజులకే.. విగత జీవిగా నవవధువు
Ganesh Mudavath
|

Updated on: Feb 24, 2022 | 8:45 AM

Share

జీవితంలో పెళ్లి(Marriage) అనేది అత్యంత విశేషమైనది. ఇరువురిని మాత్రమే కాకుండా.. రెండు కుటుంబాలను ఒక్కటి చేసేదే పెళ్లి. అందుకే వివాహానికి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు అంటారు. పెళ్లి విషయంలో తొందర పనికి రాదు. అది నవ దంపతుల భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చే అవకాశం ఉంది. పెళ్లికి యువతీ, యువకుల అంగీకారం చాలా అవసరం. ఏ ఒక్కరికీ ఇష్టం లేకపోయినా వివాహాన్ని మానుకోవాలి. అంతే గానీ తెలిసిన వారు, మంచి సంబంధం అని బలవంతం చేయకూడదు. కాదని చేస్తే నచ్చని వారితో జీవితాంతం కలిసి ఉండలేక అనుక్షణం సతమతమవుతుంటారు. విచక్షణ కోల్పోయి ఆత్మహత్య(Suicide) లు చేసుకునే స్థాయికి వెళ్లవచ్చు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహం ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. మేనరిక సంబంధం ఇష్టం లేని ఓ వధువు.. పెళ్లయిన వారం రోజులకే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్(Hyderabad) చర్లపల్లిలోని ఈసీనగర్‌కు చెందిన శైలజ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తి చేసింది. ఆమె ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విధుల్లో చేరింది. ఈ క్రమంలో శైలజకు వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరికి చెందిన తన మేనబావను ఇచ్చి వివాహం చేశారు. బుధవారం భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. తలుపు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి తీశారు. అప్పటికే ఫ్యానుకు విగత జీవిగా వేలాడుతున్న శైలజను కిందికి దించారు. వివాహానికి ముందు మేనరికం పెళ్లి ఇష్టం లేదని శైలజ చెప్పిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బలవన్మరణానికి పాల్పడిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Maruti Suzuki: మారుతి బాలెనో కొత్త మోడల్‌ అదుర్స్‌.. చిప్‌ల సరఫరాతో విక్రయాల్లో మరింత ఊపు: CEO

Andhra Pradesh: మాజీ మంత్రి కోసం పోలీసుల పడిగాపులు.. ఆయన అరెస్ట్‌ తప్పదా?

Visakhapatnam: హెటెరో డ్రగ్స్‌ పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురి కార్మికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..