Telangana: వాహనదారులకు సర్‌ఫ్రైజ్.. ఆలోచింప చేస్తున్న పోలీసుల పని తీరు!
చట్టం తన పని తాను చేస్తుంది అనుకుంటే తప్పు. చట్టం మీ ప్రాణాలను కాపాడుతుందని నిరూపిస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు. వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా..

మెదక్, ఏప్రిల్ 18: హెల్మెట్ పెట్టుకోండి బాబూ.. మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ పోలీసులు వేడుకుంటున్నారు. చట్టం తన పని తాను చేస్తుంది అనుకుంటే తప్పు. చట్టం మీ ప్రాణాలను కాపాడుతుందని నిరూపిస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు. వినూత్న రీతిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా ఒక వినూత్న దృశ్యానికి వేదికైంది. సాధారణంగా పోలీసులు రోడ్డుపై కనిపిస్తే చలాన్లు వేస్తారని భయపడే వాహనదారులకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఎదురైంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారిని పోలీసులు గౌరవిస్తుంటే, పాటించని వారిని ప్రాధేయపడ్డారు పోలీసులు.
నిబంధనలు పాటించే వారిని శాలువాతో సన్మానించడం ఒక ఎత్తు అయితే.. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి పోలీసులు రెండు చేతులు జోడించి దండం పెడుతూ విన్నవించడం అందరినీ ఆలోచింపజేసింది. “మీ ప్రాణం మీ కుటుంబానికి ముఖ్యం.. దయచేసి హెల్మెట్ ధరించండి” అంటూ పోలీసులు చేసిన రిక్వెస్ట్ వాహనదారుల మనసు గెలుచుకుంది. కేవలం జరిమానాలు వేయడమే పోలీసుల పని కాదు, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రాధాన్యత అని నర్సాపూర్ పోలీసులు నిరూపించారు. పోలీసుల తీరు పై స్థానికులు, వాహనదారుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వాహనదారులు తమ బాధ్యతను గుర్తించి హెల్మెట్ ధరిస్తారని ఆశిద్దాం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




