Congress: నకిరేకల్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం.. పీపుల్స్ క్వశ్చన్ అవర్ ఏర్పాటు చేసిన వీరేశం..
క్వశ్చన్ అవర్ అనే పదం సాధారణంగా చట్టసభల్లో వినిపిస్తుంటుంది. క్వశ్చన్ అవర్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన వందరోజుల ప్రజాపాలనపై ప్రజల నుంచి పీపుల్స్ క్వశ్చన్ అవర్ ను నిర్వహించారు. పీపుల్స్ క్వశ్చన్ అవర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

క్వశ్చన్ అవర్ అనే పదం సాధారణంగా చట్టసభల్లో వినిపిస్తుంటుంది. క్వశ్చన్ అవర్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నిస్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం తన వందరోజుల ప్రజాపాలనపై ప్రజల నుంచి పీపుల్స్ క్వశ్చన్ అవర్ ను నిర్వహించారు. పీపుల్స్ క్వశ్చన్ అవర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యేగా వేముల వీరేశం ఎన్నికయ్యారు. నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు. తెలంగాణ ఏర్పడి తొలి ఎన్నికల్లో వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించారు. కాంగ్రెస్ ప్రజాపాలనకు వంద రోజులు- ప్రజా నాయకుడికి 100 ప్రశ్నలు’ పీపుల్స్ క్వశ్చన్ అవర్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సమాధానం చెప్పారు. ప్రధానంగా నియోజక వర్గానికి సాగునీటి కల్పన, రహదారుల విషయంలో ప్రజలు పలు ప్రశ్నలను ఎమ్మెల్యే వీరేశం దృష్టికి తీసుకువచ్చారు.
వంద రోజుల కాంగ్రెస్ ప్రజా పాలనలో 65 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గానికి ప్రాణాధారమైన బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకాన్ని జూన్ నాటికి పూర్తిచేసి సాగునీటిని అందిస్తానని వీరేశం చెప్పారు. విజన్ నకిరేకల్ పేరుతో 200 మందితో అఖిలపక్ష కమిటీని వేసి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని ఆయన అన్నారు. గంజాయి రహిత నకిరేకల్‌గా చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేగా తన పని తీరుపై స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశ్నించే గొంతుకగా ప్రజల నుంచి స్పందన తెలుసుకోవడానికి పీపుల్స్ క్వశ్చన్ అవర్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధిపై పీపుల్స్ క్వశ్చన్ అవర్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు చామల శ్రీనివాస్, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్, జెల్ల ముత్తిలింగయ్య, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, సుంకరబోయిన నర్సింహ, లింగాల వెంకన్న పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




