Nagarjuna Sagar By Election Results 2021: రౌండు రౌండుకీ మెజార్టీ పెరుగుతున్న తీరు..సాగర్ లో కారు జోరు..

Nagarjuna Sagar Assembly By Election Results 2021 LIVE Counting and Updates: నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ప్రతి రౌండ్ లోనూ కారు జోరు చూపెడుతోంది.

Nagarjuna Sagar By Election Results 2021: రౌండు రౌండుకీ మెజార్టీ పెరుగుతున్న తీరు..సాగర్ లో కారు జోరు..
Nomula Bhagat
Follow us

|

Updated on: May 02, 2021 | 11:17 PM

Nagarjuna Sagar By Election Results 2021: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రతి రౌండులోనూ కారు జోరుగా సాగిపోతోంది. ఇక్కడ గెలుపు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ వెనుకబడిపోయింది. కడపటి వార్తలు అందేసరికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో 18వ రౌండ్లు ముగిశాయి. అప్పటికి TRS పార్టీ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌ 13,396 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినదగ్గర నుంచీ.. టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రతి రౌండ్ లోనూ ఆ పార్టీ అభ్యర్థి లీడ్ సాధిస్తూ వస్తున్నారు. ముక్కోణపు పోటీలా కనిపించిన నాగార్జున సాగర్ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా మూడో స్థానంలో ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి కి, టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కు మధ్యనే ప్రధాన పోరు నిలిచింది. ఇక రౌండ్ రౌండ్ కూ టీఆర్ఎస్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది.

ఇక ఇప్పటివరకూ ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన ఫలితాలు రౌండ్ల వారీగా ఇలా ఉన్నాయి..

  • తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి.
  • రెండో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 3,854, కాంగ్రెస్‌కు 3113 ఓట్లు వ‌చ్చాయి.
  • మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, కాంగ్రెస్ పార్టీకి 2,882 ఓట్లు పోల‌య్యాయి.
  • నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 4,186 ఓట్లు, కాంగ్రెస్ కు 3,202 ఓట్లు వ‌చ్చాయి.
  • ఐదో రౌండ్‌టో టీఆర్ఎస్‌కు 3,442, కాంగ్రెస్ కు 2676, బీజేపీకి 74 ఓట్లు పోల‌య్యాయి.
  • ఆరో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3,989, కాంగ్రెస్ పార్టీకి 3,049 ఓట్లు వ‌చ్చాయి.
  • ఏడో రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 4,022, కాంగ్రెస్ పార్టీకి 2,607 ఓట్లు వ‌చ్చాయి.
  • ఎనిమిది రౌండ్లో టీఆర్ఎస్‌కు 3, 249, కాంగ్రెస్ పార్టీకి 1,893 ఓట్లు పోల‌య్యాయి.
  • తొమ్మిదో రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,205, కాంగ్రెస్‌కు 2,042 ఓట్లు వచ్చాయి.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. నల్గొండలోని గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ జరుగుతోంది. ​తొలుత గుర్రంపోడు మండల ఓట్ల లెక్కింపుతో ప్రారంభం అయిన కౌంటింగ్.. త్రిపురారం మండల ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది. రెండు హాళ్లలో 14 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ​మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. గత నెల 17న సాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరిగింది.

Also Read: Nagarjuna Sagar By Election Results 2021 LIVE: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి ఇలా ఉంది..

Tirupati By Election Results 2021 LIVE: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. కొనసాగుతోన్న వైసీపీ హావా.!