AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Sadhu: భద్రాద్రి కొత్త గూడెంలో నాగ సాధవులు.. కాశీ నుంచి తిరుపతికి పాద యాత్రగా వెళుతోన్న క్రమంలో.

Naga Sadhu: నాగ సాధువులు అంటే ముందుగా శరీరం నిండా బూడిదా, పొడవైన వెంట్రుకలు, చాలి చాలని దుస్తులు ఇదే రూపం మదిలోకి వస్తుంది. సాధారణంగా ఇలాంటి సాధువులు...

Naga Sadhu: భద్రాద్రి కొత్త గూడెంలో నాగ సాధవులు.. కాశీ నుంచి తిరుపతికి పాద యాత్రగా వెళుతోన్న క్రమంలో.
Naga Sadhu
Narender Vaitla
|

Updated on: Aug 03, 2021 | 7:47 PM

Share

Naga Sadhu: నాగ సాధువులు అంటే ముందుగా శరీరం నిండా బూడిదా, పొడవైన వెంట్రుకలు, చాలి చాలని దుస్తులు ఇదే రూపం మదిలోకి వస్తుంది. సాధారణంగా ఇలాంటి సాధువులు మనకు ఉత్తర ప్రదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ తాజాగా నాగ సాధవులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం పాల్వంచ పట్టణ పాత పాల్వంచలో కాశీ నుంచి వచ్చిన నాగ సాధవులు దర్శనమిచ్చారు. దీంతో వారిని చూడడానికి స్థానికులు ఆసక్తి కనబరిచారు.

పాత పాల్వంచలో ఉన్న ప్రాచీన ఆత్మ లింగేశ్వరలయాన్ని నాగసాధవులు సందర్శించారు. కాశీకి చెందిన ఈ నాగసాధవులు తిరుపతికి పాద యాత్రగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే చత్తీస్‌ఘడ్‌ మీదుగా భద్రాచలం వచ్చి విజయవాడ, శ్రీశైలం గుండా తిరుపుతి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా మార్గమధ్యలో పాల్వంచలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాధువులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుకున్నారు. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ నాగ సాధువులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మచ్చా శ్రీనివాసరావు, నాదెళ వేణువరన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Also Read: Matrimony Fraud: మ్యాట్రిమోని మోసం.. యూస్‌ లో ఫార్మాసిస్టు అన్నాడు ఏకంగా 10 లక్షలు దోచేశాడు..

Wearing new Clothes: కొత్తబట్టలు ధరించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే ఈ ఇబ్బందులు తప్పవు..

MLA Roja: డప్పు కొట్టి దుమ్మురేపిన MLA రోజా.. అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్