Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Cement: కస్టమర్ల కోసం మై హోం ఇండ‌స్ట్రీస్ మ‌రో ముంద‌డుగు.. సిమెంట్ విషయంలో ఇకపై ఇబ్బందులే ఉండవ్..

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో మైహోమ్ సిమెంట్‌ కంపెనీ వినియోగదారుల సౌకర్యం కోసం కొనుగోలు చేసిన 250 సిమెంట్‌ బల్క్ ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైహోమ్ సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ ప్రెసిడెంట్ విజయవర్ధన్ రావు బల్క్‌ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైహోం ఇండస్ట్రీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Maha Cement: కస్టమర్ల కోసం మై హోం ఇండ‌స్ట్రీస్ మ‌రో ముంద‌డుగు.. సిమెంట్ విషయంలో ఇకపై ఇబ్బందులే ఉండవ్..
My Home Group's Maha Cement
Follow us
M Revan Reddy

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 09, 2025 | 12:20 PM

సిమెంట్ తయరీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న మహ సిమెంట్ వినియోగ దారుల సేవలకు పెద్ద పీట వేస్తోంది. మెరుగైన సేవ‌ల‌తోపాటు ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు మహా సిమెంట్ సరికొత్త ప్రణాళికలతో ముందుకు వచ్చింది. ముఖ్యంగా మార్కెట్ వాటాను పెంచుకునేందుకు సకాలంలో వినియోగదారులకు సిమెంట్ బ‌ల్క్ స‌ప్లైలో మై హోం ఇండ‌స్ట్రీస్ మ‌రో ముంద‌డుగు వేసింది.  తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని వినియోగదారుల సౌకర్యం కోసం 250 సిమెంట్‌ బల్క్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నో విశిష్టతలకు మారుపేరుగా ఉన్న మహా సిమెంట్ మై హోం ఇండ‌స్ట్రీస్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మహాసిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందింది. మై హోం గ్రూప్ హైద‌రాబాద్ ప్ర‌ధాన కేంద్రంగా ప‌ని చేస్తూ.. సిమెంట్, రియ‌ల్ ఎస్టేట్, క‌న్ స్ట్ర‌క్ష‌న్, ప‌వ‌ర్, మీడియా & ఎడ్యుకేష‌న్ సెక్టార్ల‌లో త‌న‌దైన ముద్ర వేసుకుంది. మూడు ద‌శాబ్దాల‌కు పైగా అమూల్య‌మైన సేవ‌ల‌ను అందిస్తూ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని చూర‌గొంది. దేశంలో లాజిస్టిక్ విభాగం శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో.. మౌలిక‌ స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌లో మై హోం ఇండ‌స్ట్రీస్ తీసుకున్న ఈ చొర‌వ‌ కీలకంగా మారనుంది.

కాగా.. మహా సిమెంట్.. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. రంజిత్ రావు నాయకత్వంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే మహా సిమెంట్ ను వినియోగదారులకు బ‌ల్క్ స‌ప్లైలో మ‌రో ముంద‌డుగు వేసింది. ఇందుకు ఉప‌యోగ‌ప‌డే భారీ ట్ర‌క్కులు, ట్రైలర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. సూర్యాపేట జిల్లా మేళ్ల‌చెరువు శ్రీన‌గ‌ర్ లోని మహా సిమెంట్ ప్రాంగణంలో భారీ ట్రక్కులను ప్రారంభించారు.14 వీల్స్ కలిగిన ట్ర‌క్కులు,16 వీల్స్ కలిగిన వంద ట్ర‌క్కులు అలాగే బ‌ల్క్ 41 ఎం.టి కెపాసిటీ క‌లిగిన 50 ట్రైల‌ర్స్ ను మహా సిమెంట్ మార్కెటింగ్ సీనియ‌ర్ ప్రెసిడెంట్ కె. విజ‌య్ వ‌ర్ధ‌న్ రావు జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 250 సిమెంట్‌ బల్క్ ట్యాంకర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.

వీడియో చూడండి..

రానున్న రోజుల్లో దేశంలో నిర్మాణ రంగానికి సిమెంటు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని విజయవర్ధన్ రావు చెప్పారు. పెరిగే డిమాండ్ అనుగుణంగా సిమెంట్ సరఫరా చేసేందుకు మహా సిమెంట్ సేవలను విస్తృతం చేసేందుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు రోడ్లు, రేడియల్ రోడ్స్, మెట్రో వంటి భారీ ప్రాజెక్టులు రానున్నాయని, అందుకు అవసరమైన సిమెంట్ ఉత్పత్తికి కంపెనీ సిద్ధంగా ఉందని అన్నారు, త్వరలో 20 మిలియన్ మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తికి చేరుకోనున్నామని ఆయన తెలిపారు.

మై హోమ్ ఇండస్ట్రీస్ గ్రూప్ లో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 10 వేల మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయి. జాతీయ స్థాయిలో వివిధ విభాగాలు, ప్రాంతాల్లో మై హోం గ్రూప్ న‌కు క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు. ఉత్ప‌త్తులు, సేవ‌ల్లో నాణ్య‌త‌తో పాటు వ్యాపార ప్ర‌మాణాల‌ను పాటించ‌డంలో క‌చ్చితత్వంతో మై హోం గ్రూప్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..