రాజ్యాంగం సాక్షిగా ఒక్కటైన జంట.. అంబేద్కర్ ఎదుట జరిగిన ఆదర్శ వివాహం..
వధూవరులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందినవారు కావడం, ఆ గ్రామంలో ఆసక్తి కలిగించింది. పెళ్ళంటే నూరేళ్ళ పంట. అలాంటిది ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలకు ఆకర్షితులైన ఇద్దరు యువతి యువకులు స్టేజి పెళ్లి చేసుకుని గ్రామానికే ఆదర్శం గా నిలిచారు. అయితే వరుడు బీరవల్లి ప్రశాంత్ జార్ఖండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా, వధువు నాగ జ్యోతి ఆంధ్రా లోని విజయవాడ లో విధులు నిర్వహిస్తున్నారు.

కుల మతాలు, సాంప్రదాయాలకు అతీతంగా వారిద్దరూ ఒక్కటయ్యారు. బాబా సాహెబ్ అంబేద్కర్ సాక్షి గా నేటి సమాజానికి ఆదర్శంగా ఈ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకున్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న బీరవల్లి ప్రశాంత్, నాగ జ్యోతి వివాహం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో జరిగింది ఈ ఆదర్శ వివాహం. పెళ్లి వేదిక పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భావజాలం కలిగిన పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి తంతు ముగించారు. భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు..
నూతన వధూవరులిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నామని ప్రమాణం చేస్తూ రాజ్యాంగం బుక్ సాక్షిగా భార్య భర్తలయ్యారు. భారత రాజ్యాంగం బుక్ పై ప్రమాణం చేయించి, అంబేద్కర్ ఫోటో సాక్షిగా పూలమాలలు మార్చుకుని, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆదర్శ వివాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీడియో ఇక్కడ చూడండి..
వధూవరులు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందినవారు కావడం, ఆ గ్రామంలో ఆసక్తి కలిగించింది. పెళ్ళంటే నూరేళ్ళ పంట. అలాంటిది ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలకు ఆకర్షితులైన ఇద్దరు యువతి యువకులు స్టేజి పెళ్లి చేసుకుని గ్రామానికే ఆదర్శం గా నిలిచారు. అయితే వరుడు బీరవల్లి ప్రశాంత్ జార్ఖండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా, వధువు నాగ జ్యోతి ఆంధ్రా లోని విజయవాడ లో విధులు నిర్వహిస్తున్నారు. విద్యావంతులైన ఇరువురు ఆదర్శ వివాహానికి సిద్ధపడటం అభినందించదగ్గ విషయమని గ్రామ పెద్దలు నూతన వధువు వరులను అభినందించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..