Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరాన్ని ముంచేసిన మూసీ.. ప్రకృతి ఆగ్రహమా..? మానవ తప్పిదమా..?

మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌ నగరాన్ని ఏ రేంజ్‌లో చూడాలనుకున్నారో తెలుసా. టాప్‌ క్లాస్‌ సిటీ అవుతుందని దశాబ్దాల క్రితమే ఊహించారు. ఇదో ఐకానిక్‌ సిటీ అవుతుందని అప్పట్లోనే కలగన్నారు. అందుకోసమే.. దశాబ్దాల పాటు పనికొచ్చే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ను హైదరాబాద్‌కు అందించారు. మరి.. ఆ తరువాత వచ్చిన వాళ్లంతా చేసిందేంటి? సిటీ మధ్యలోంచి నది వెళ్లడం ప్రకృతి ఇచ్చిన అత్యంత అరుదైన అవకాశం. అలాంటి నదిని మరో వైతరణిగా మార్చేశారు.

భాగ్యనగరాన్ని ముంచేసిన మూసీ.. ప్రకృతి ఆగ్రహమా..? మానవ తప్పిదమా..?
Musi River Flood
Balaraju Goud
|

Updated on: Sep 27, 2025 | 9:55 PM

Share

2023లో దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన వర్షాలకు యమున ఏ స్థాయిలో ఉప్పొంగిందంటే.. ఎర్రకోటలోని తలుపుల వరకు వరద ముంచెత్తింది. దాదాపుగా 50 ఏళ్ల తరువాత ఆ స్థాయి వరదలు వచ్చాయి. నిజానికి.. యమున వాస్తవ ప్రవాహం అదే. కాకపోతే.. కబ్జాలతో, ఇష్టారీతిన నిర్మాణాలతో యమున గతినే మార్చేశారు. కాని, 50 ఏళ్ల తరువాత తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, తన ప్రవాహ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ పోయింది. యమున తన దారి తాను వెతుక్కుంటూ వెళ్లింది. మనుషులు గతాన్ని మరిచిపోతారేమో గానీ.. ప్రకృతి కాదు. వందేళ్లైనా సరే.. తన దారిని వెతుక్కుంటూ వచ్చేస్తుంది. మూసీ మహోగ్ర రూపానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మూసీని ‘నది’గా కాకుండా.. ఓ పిల్ల కాలువలా చూడ్డం మొదలుపెట్టారు కొందరు. నదీ గర్భంలోనే ఇళ్లు కట్టుకున్నారు. ఎందుకంటే.. మూసీ ఉగ్రరూపాన్ని అక్కడున్న వాళ్లు మరిచిపోయారు కాబట్టి. ఏకంగా గుళ్లు కట్టేశారు. ఇన్నేళ్లుగా రాని వరద ఇప్పుడు మాత్రం వస్తుందా ఏంటి అని. కాని, 30 ఏళ్ల తరువాత తనలోని మరో రూపాన్ని చూపించింది. ఇళ్లు, వాకిళ్లు, గుళ్లు గోపురాలు, షాపులు, ఆక్రమించి కట్టిన నిర్మాణాలు.. ఇలా అన్నిటినీ ముంచేసింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాగే వస్తా అనే హెచ్చరికలు పంపింది. ఇంతకీ.. 30 ఏళ్ల తరువాత మూసీ ఉరమడానికి కారణమేంటి? తెలుసుకుందాం. వరదల కారణంగా ఒక ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి చూశామా హైదరాబాద్‌లో. కడుపుకి ఇంత తిండి,...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి