తెల్లారితే ప్రచారినిక తెరపడనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని రాత్రి కూడా కొనసాగిస్తున్నారు. అందుబాటులో ఉన్న గ్రామాలన్నింటినీ కలియదిరిగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో చౌటుప్పల్-హైదరాబాద్ రోడ్డుపై ఉద్రిక్తత కనిపించింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని అడ్డుకున్నారు స్థానిక టీఆర్‌ఎస్ కార్యకర్తలు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజగోపాల్ ఒక్కసారి కూడా తమ గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజగోపాల్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి ఓ వ్యక్తి చెప్పులు చూపించాడు. దాంతో.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వేదికపై నుంచి రాజగోపాల్ కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. వెంటనే బీజేపీ కార్యకర్తలూ రియాక్ట్ అయ్యారు. దాంతో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల కార్యకర్తల మధ్య కాసేపు వాగ్వాదం, ఉద్రిక్తత చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు.. రెండు వర్గాలను కట్టడి చెశారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..