Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ప్రచారం.. రంగంలోకి కీలక నేతలు

తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నువ్వా..? నేనా అనే రీతాలో కొనసాగే..

Munugode Bypoll: మునుగోడులో ఊపందుకున్న ప్రచారం.. రంగంలోకి కీలక నేతలు
Munugode
Follow us

|

Updated on: Oct 21, 2022 | 10:56 AM

తెలంగాణలో రాజకీయాలు జోరందుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం వేడెక్కింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నువ్వా..? నేనా అనే రీతాలో కొనసాగే ఈ ఉప ఎన్నిక సందర్భంగా పలువురు బడా నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు మునుగోడు నియోజకవర్గం బాట పట్టారు. మునుగోడు మండలంలో శుక్రవారం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రచారం చేయబోతున్నారు. అలాగే చౌటుప్పల్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌ షో నిర్వహించబోతున్నారు. అలాగే నారాయణపురంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రోడ్‌ షో నిర్వహిస్తారు.

మునుగోడులో ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దూమారం రేపుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టార్గెట్‌గా టీఆర్‌ఎస్ మెయిన్‌గా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ టార్గెట్‌గా బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీలోనూ కాంగ్రెస్‌ ఏకీపారేస్తోంది. మూడు పార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలో మకాం వేసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నారు. ఈనెలాఖరులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కీలక నేతలు రంగంలోకి దిగి నియోజకవర్గంలో పర్యటిస్తుండటంతో సందడి సందడిగా నెలకొంది. ఎటు చూసినా ప్రచారాలే కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..