AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు నెలల శిశువు మిస్సింగ్.. అదే పనిగా ఏడుస్తున్న తల్లి.. ఆరా తీస్తే, పోలీసులే షాక్!

నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. కర్కశంగా మారింది. గోరు ముద్దులు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి, ఏకంగా కన్న కూతురిని చంపేసింది. కన్న పేగును తెంచి శిశువుకు జన్మనిచ్చిన తల్లి కసాయిగా మరి రెండు నెలల శిశువును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

రెండు నెలల శిశువు మిస్సింగ్.. అదే పనిగా ఏడుస్తున్న తల్లి.. ఆరా తీస్తే, పోలీసులే షాక్!
Well
P Shivteja
| Edited By: |

Updated on: May 23, 2025 | 12:44 PM

Share

నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి.. కర్కశంగా మారింది. గోరు ముద్దులు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి, ఏకంగా కన్న కూతురిని చంపేసింది. కన్న పేగును తెంచి శిశువుకు జన్మనిచ్చిన తల్లి కసాయిగా మరి రెండు నెలల శిశువును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే సిద్దిపేటజిల్లా అప్పనపల్లి గ్రామంలో సిద్దిపేట రూరల్ గ్రామానికి చెందిన శ్రీమన్, కవిత దంపతులు పనుల నిమిత్తం అప్పనపల్లి గ్రామంలో నివాసం ఉంటూన్నారు. వీరికి రెండు నెలల బాబు ఉన్నాడు. అయితే భర్త శ్రీమాన్ పని నిమిత్తం మిరుదొడ్డికి వెళ్ళగా, ఏం జరిగిందో తెలియదు కానీ, కవిత తన రెండు నెలల శిశువును బావిలో పడేసి చంపేసింది. మళ్ళీ తన బాబును ఎవరో బైక్‌పై వచ్చి ఎత్తుకెళ్లారంటూ ఓ డ్రామాకు తెరలేపింది. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టురట్టు బయటపెట్టారు.

భర్త వచ్చాక బాబు కనపడటం లేదు అని, భార్యాభర్తలు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో కవితపై అనుమానం వచ్చిన పోలీసులు కవితను గట్టిగా నిలదీయడంతో బాబును చంపి బావిలో పడవేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంను గోప్యంగా ఉంచి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని గ్రామస్థుల ఆధ్వర్యంలో బాలుడి శవాన్ని బావిలో నుండి బయటకు తీశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు.

కన్నతల్లి కడతెరిచి కట్టుకథ అల్లి చెబుతోందని, దీని వెనక కథ ఎంత ఉందో అన్న విషయాలను ఆరా తీసేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఏది ఏమైనా కన్నబిడ్డను తల్లి చంపిందనే విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు