‘మీకు ఎందుకు ఉద్యోగాలు, జీతాలు..’ ఏజెన్సీ వైద్యులకు జిల్లా కలెక్టర్ మాస్ వార్నింగ్..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలోని ఓ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉద్యోగుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏజెన్సీలోని ఓ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇది హాస్పిటలా.. మ్యూజియంలా ఉందంటూ వారికి వ్యంగ్యంగా చురకలు అంటించారు.
బూర్గంపాడు ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో వైద్యుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. హాస్పటల్ లో నార్మల్ డెలివరీ చేయక పోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నెల రోజుల్లో పనితీరు మార్చుకోకపోతే బదిలీ చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత కొన్ని మాసాలుగా హాస్పిటల్‌లో నార్మల్ డెలివరీలు చేయకపోవడం పట్ల డాక్టర్లను మందలించారు. జీతాలు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సేవ చేయాలి కదా అంటూ మండిపడ్డారు. నెలరోజుల్లో పనితీరు మార్చుకోకపోతే స్టాఫ్ అందరిని బదిలీ చేస్తామంటూ హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ తనిఖీలు, ప్రశ్నలతో బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బందికి ముచ్చెమటలు పోయించారు. గతంలోనూ విజిట్ చేసి పనితీరు మార్చుకోవాలని సూచించారు. అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై లాస్ట్ వార్నింగ్ అంటూ హెచ్చరిక చేశారు. జిల్లా కలెక్టర్ పనితీరు పై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయనకు నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. శభాష్ కలెక్టర్ అంటూ అభినందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
