Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro Fare: ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌.. మెట్రో రైల్ చార్జీల చార్ట్‌ వచ్చేసింది! కొత్త టికెట్‌ ధరలు ఇవే

ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులువుగా గమ్యస్థానాల్ని చేరడానికి అధిక మంది మెట్రో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా మెట్రోల్లో చార్జీలను పెంచుతూ యాజమాన్యం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్‌ టీ యూటర్న్‌ తీసుకుంది. పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ..

Hyderabad Metro Fare: ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్‌.. మెట్రో రైల్ చార్జీల చార్ట్‌ వచ్చేసింది! కొత్త టికెట్‌ ధరలు ఇవే
Hyderabad Metro Revised Fare
Srilakshmi C
|

Updated on: May 23, 2025 | 12:44 PM

Share

హైదరాబాద్, మే 23: హైదరాబాద్‌లో అధిక మంది జనాలు మెట్రోల్లో ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులువుగా గమ్యస్థానాల్ని చేరడానికి మెట్రో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా మెట్రోల్లో చార్జీలను పెంచుతూ యాజమాన్యం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్‌ టీ యూటర్న్‌ తీసుకుంది. పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ.. శుక్రవారం (మే 23) కొత్త చార్జీల చార్టును విడుదల చేసింది. ఇందులో 10 శాతం డిస్కౌంటు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చార్జీలు విడుదల చేసింది.

ఫేర్ జోన్ వారీగా సవరించిన హైదరాబాద్ మెట్రో రైల్ కొత్త చార్జీల చార్టు ఇదే..

  • 2 కిలోమీటర్లలోపు ఛార్జీ రూ.11
  • 2 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.17
  • 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.28
  • 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.37
  • 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.47
  • 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.51
  • 15 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.56
  • 18 నుంచి 21 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.61
  • 21 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.65
  • 24 ఆపై కిలోమీటర్లకు ఛార్జీ రూ.69

జోన్ వారీగా ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) నిర్ణయించిన పెంపునకు సంబంధించి ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంటు ఇస్తూ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. మే 24 నుంచి పేపర్ క్యూఆర్/టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు.. అన్ని చెల్లింపులకు వర్తిస్తుంది. ప్రయాణికులు స్మార్ట్ కార్డులు, డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించి స్మార్ట్‌గా ప్రయాణించాలని ప్రయాణికులకు మెట్రో సంస్థ విజ్ఞప్తి చేసింది. నగర వాసులకు సురక్షితమైన, విశ్వసనీయమైన, అందుబాటు స్థాయిలో చార్జీలతో మెట్రో సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.