AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 & KAB Education Expo 2025: టీవీ9 ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. నేటి నుంచి 3 రోజులు విద్యార్ధులకు పండగే!

TV9 & Kab 2025 ఎడ్యుకేషన్ ఎక్స్ పోను ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ బాలకిష్ట రెడ్డి శుక్రవారం (మే 23) ప్రారంభించారు. ఎడ్యుకేషన్ ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్టాళ్లను పరిశీలించారు. విద్యార్ధుల సౌకర్యార్థం స్టాళ్లను ఏర్పాటు చేసిన..

TV9 & KAB Education Expo 2025: టీవీ9 ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. నేటి నుంచి 3 రోజులు విద్యార్ధులకు పండగే!
TV9 & KAB Education Expo
Srilakshmi C
|

Updated on: May 23, 2025 | 12:50 PM

Share

హైదరాబాద్‌, మే 23: హైదరాబాద్‌ మహా నగరంలో TV9 & Kab 2025 ఎడ్యుకేషన్ ఎక్స్ పోను ఐటీ శాఖా మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ బాలకిష్ట రెడ్డి శుక్రవారం (మే 23) ప్రారంభించారు. ఎడ్యుకేషన్ ఎక్స్ పో ప్రారంభ కార్యక్రమం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్టాళ్లను పరిశీలించారు. విద్యార్ధుల సౌకర్యార్థం స్టాళ్లను ఏర్పాటు చేసిన TV9 & Kab ను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్‌లో మే 23 నుంచి 25 వరకు 3 రోజులపాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ నంబర్ 1లో జరుగుతుంది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు హాజరుకావచ్చు.

TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా మెగా ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025 దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహిస్తోంది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, బెంగళూరు, హుబ్బళ్లి, గుల్బర్గా, పాట్నా, కోల్‌కతా, గౌహతి, పూణే, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తో సహా దేశంలోని మొత్తం15 ప్రధాన నగరాల్లో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్ పో జరుగుతుంది. ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం శుక్రవారం (మే 23) నుంచి హైదారబాద్‌లో ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థులకు ఉన్నత విద్యా కోర్సుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వరకు విస్తృత శ్రేణి కెరీర్ అవకాశాలను ఇక్కడ నిపుణులను అడిగి స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ ఎక్స్‌పోలో దిశానిర్దేశం చేస్తారు. విద్యార్ధులకు ఉచితంగా నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ముఖ్యంగా EAPCET, ECET, JoSAA, NEET వంటి కీలక ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు వెబ్ కౌన్సెలింగ్, స్కోర్‌ల ఆధారంగా ఏయే ఎంపికలు అందుబాటులో ఉంటాయో వంటి వివరాలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు ఈ ఎక్స్‌పోకు హాజరు కావచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత.. అరుదైన రికార్డు దిశగా సీఎం విజయ్!
ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత.. అరుదైన రికార్డు దిశగా సీఎం విజయ్!
నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్!
నితిన్ గడ్కరీ సీరియస్ వార్నింగ్!
వెయ్యి కోట్ల కల.. ఈ ఏడాదైనా తీరుతుందా..?
వెయ్యి కోట్ల కల.. ఈ ఏడాదైనా తీరుతుందా..?
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయం.. గిల్ క్లారిటీ
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే మహిళకు..
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
పండు మాస్టర్‌ను పరామర్శించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడెలా ఉన్నాడంటే?
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
కొత్త జంటలకు స్వర్గధామం..ఇండియన్స్ మెచ్చే రొమాంటిక్ డెస్టినేషన్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
రుచి చూడాల్సిందే.. హైదరాబాద్ స్టైల్‌లో చికెన్ మెజిస్టిక్స్
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌ నిబంధనలు తెచ్చే ఆలోచనలో కేంద్రం
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..
ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ రచ్చ .. అస్సలు మిస్ అవ్వకండి..