Moinabad: ఇంటికి తాళం వేసి సంతకు వెళ్లిన యజమాని! గోడకు కన్నం వేసి..

పట్టపగలు గోడకు కన్నంవేసి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో దాచుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Moinabad: ఇంటికి తాళం వేసి సంతకు వెళ్లిన యజమాని! గోడకు కన్నం వేసి..
Thieves
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 31, 2022 | 6:20 PM

Moinabad Crime News: పట్టపగలు గోడకు కన్నంవేసి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో దాచుకున్న సొత్తును దుండగులు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లో నివసముంటున్న కంజర్ల సువర్ణ ఆగస్టు 30వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇంటికి తాళం వేసి కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్లింది. ఇంతలో కొందరు దొంగలు ఇంటి వెనుక భాగంలో గోడను పగుల గొట్టి ఇంటిలోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువా తెరచి, లోపల లాకర్‌లో ఉన్న రూ.6 లక్షలను దోచుకున్నారు. ఆ తర్వాత వచ్చిన మార్గాన్నే కిక్కురుమనకుండా ఉడాయించారు. సంతనుంచి వచ్చిన మహిళ తాళం తెరిచి లోపలికి ప్రవేశించి అక్కడి దృశ్యం చూసి షాక్‌ అయ్యింది. ఇంటికి వేసిన తాళం అలాగే ఉన్నా.. గోడను ధ్వంసం చేసి, దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు ఫైల్‌ చేసి, సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. ఇంటి యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.