AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్పుల ఘటన.. తీన్మార్‌ మల్లనపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు! ఆ తర్వాత..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జాగృతి కార్యకర్తలపై దాడి చేయించినట్లు ఆరోపిస్తూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ పాత్రను కూడా ఆమె ప్రశ్నించారు.

కాల్పుల ఘటన.. తీన్మార్‌ మల్లనపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు! ఆ తర్వాత..
Mlc Kavitha And Mallanna
SN Pasha
|

Updated on: Jul 13, 2025 | 6:01 PM

Share

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి, కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కంప్లైయింట్‌ ఇచ్చిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. “నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ చెయ్యడానికి డీజీపీ గారి ఆఫీసుకు వచ్చాను. మా జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్ననా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను.

ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరుగుతుంటే డీజీపీ ఆఫీస్‌కి రాకపోవడం అంటే దీని వెనక ప్రభుత్వం కూడా ఉందని మేం అనుకోవాల్సి వస్తుంది. అసలు తీన్మార్‌ మల్లన్న గన్‌మెన్స్‌ ఎందుకు షూట్ చెయ్యాల్సి వచ్చిందనేది తెలియాలి. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్ మెన్స్ షూట్‌ చేయరు. మా కార్యకర్తలపైన కాల్పులు జరిపిన తీన్మార్ మల్లన్న గన్‌మెన్లను వెంటనే డిస్మిస్ చేయాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏ గన్ మెన్ కానీ, పోలీసులు కానీ కాల్పులు జరపలేదు. కానీ ఈ రోజు తీన్మార్ మల్లన్న గన్ మెన్స్ ఇలా కాల్పులు జరపడం బాధాకరం.” అని కవిత వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి