MLC Kavita: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలపై ఎమ్మెల్సీ కవిత కీలక ప్రకటన.. ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారనుందా..?
తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే తిరిగి మరోసారి ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొనబోతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.

తెలంగాణలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అయితే తిరిగి మరోసారి ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొనబోతోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బొగ్గు సంఘం నాయకులు కాస్త నిరాశకు గురయ్యారు.
అయితే కేసీఆర్ తనయ కవిత శుక్రవారం ఒక ప్రకటనలో తాము పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్థ కోసం, సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. వాటిని చూసి కార్మికులు ఆత్మసాక్షిగా ఆలోచించి ఓటేసి టీబీజీకేఎస్ సంఘాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఎదుగుదలకు, లాభాల దిశగా పరుగులు పెట్టించేందుకు నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేశారన్నారు.
సింగరేణి సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ బాణం గుర్తుపై ఓట్లేసీ భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో దాదాపు 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు అందించామని గుర్తు చేశారు. డిపెండెంట్ ఉద్యోగం వద్దనుకుంటే ఆ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ అప్పుడే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కారుణ్య నియామకాల్లో కూడా అర్హులైన వారికి ఆగ్రపీఠం వేశారని తెలియజేశారు.
మొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ పోటీ చేయదని అనుకున్నారు సీపీఐ, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు. దీంతో ఇద్దరి మధ్యే పోటీ ఉంటుందని భావించారు. కానీ తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రకటనతో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన బొగ్గు సంఘం నాయకులు ఈ ప్రకటనతో మరిన్ని వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగైనా గెలవాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 27న జరిగే సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




