Telangana: బీఆర్ఎస్‎ను వీడనున్న ఎమ్మెల్యేలు.. కొనసాగనున్న ఫిరాయింపుల పర్వం.?

తెలంగాణలో బీఆర్ఎస్‎కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్‎లోకి రాజేందర్‎నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటలకు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

Telangana: బీఆర్ఎస్‎ను వీడనున్న ఎమ్మెల్యేలు.. కొనసాగనున్న ఫిరాయింపుల పర్వం.?
Brs To Congress
Follow us
Srikar T

|

Updated on: Jul 12, 2024 | 1:32 PM

తెలంగాణలో బీఆర్ఎస్‎కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇవాళ కాంగ్రెస్‎లోకి రాజేందర్‎నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఈరోజు తిరుపతి నుంచి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటలకు మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు జంపింగ్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా మంది హస్తం గూటికి చేరేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరు మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. దీనిపై బీఆర్ఎస్ గట్టిగానే పోరాటం చేస్తోంది. స్పీకర్ కు లేఖలు రాస్తూ, న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తోంది. అయినప్పటికీ ఫిరాయింపుల పర్వం ఆగడం లేదు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‎లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటూ గాంధీభవన్ నుంచి లీకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది.

కాంగ్రెస్ లో చేరే వారి జాబితాలో ముందుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‎తోపాటూ మరో ఐదు మంది ఉన్నారు. కుత్బుల్లా పూర్ నుంచి కెపి. వివేకానంద, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి, శేరిలింగం పల్లి నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన కీలక నేత ఆరికే పూడి గాంధీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఈయన పార్టీ అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. వీరితో పాటూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి, కూకట్ పల్లి నుంచి మాధవరం కృష్ణా రావు హస్తం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గతంలో ఆరు మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ కు గడ్డుపరిస్థితులు తప్పడం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిలో కొందరు గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఉన్నారు దానం నాగేందర్. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలినట్లయింది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడారు. దీంతో సీనియర్ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ క్రమంగా బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే మొన్న జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారందరూ తిరిగి ఈ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో మరికొంత మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఊతం ఇచ్చినట్లయింది. ఈ వ్యాఖ్యలు చేసి వారం కూడా కాకుండానే ఆరు మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ లోచేరుతున్నారంటే ఇది రాజకీయంగా పెను సంచలనమనే చెప్పాలి. ఈ పరిస్థితి ఇంతటితో ఆగుతుందా లేక మరికొన్ని రోజులు కొనసాగుతుందా తెలియాలంటే వేచిచూడాలి. అలాగే దీనిని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..