Watch Video: అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రీసెంట్‌గా ఇంద్ర పార్క్ దగ్గర మిఠాయిలు తయారు చేసే ఎమరాల్డ్స్ హౌస్ లో తనిఖీలు చేశారు అధికారులు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రీసెంట్‌గా ఇంద్ర పార్క్ దగ్గర మిఠాయిలు తయారు చేసే ఎమరాల్డ్స్ హౌస్ లో తనిఖీలు చేశారు అధికారులు. ప్రాణంతమైన, ప్రమాదకరమైన ఫుడ్ కలర్స్ మిక్స్ చేసిన కొన్ని పదార్థాలను సీజ్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రైడ్స్ లో భాగంగా 60 కేజీల బెల్లం.. మూడు కేజీల జీడిపప్పును, ఇతర ముడి సరుకులను సీజ్ చేశారు. సీజ్ చేసిన సరుకులను ల్యాబ్‌కి పంపించారు. ల్యాబ్ రిపోర్ట్‌లను బట్టి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. తనిఖీల్లో జరిగిన మరికొన్ని విషయాలను వెల్లడించారు.
ఇక అమీర్ పేట్ లోని రెబల్ ఫుట్ రెస్టారెంట్ లో ఫ్రీజర్ లో కుళ్లిన మటన్, చికెన్ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్ధాల్లో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు యధేచ్చగా తిరుగుతూ కనిపించాయి. సికింద్రాబాద్ లోని వివాహభోజనంబు, గ్రిల్ నైన్ హోటల్స్ లో అధికారులు సోదాలు జరిపారు. అక్కడ కూడా సేమ్ సీన్ కనిపించింది. కుళ్లిన ఆహార పదార్ధాలు దర్శనం ఇచ్చాయి. అంతేకాదు ఎక్స్‌పైర్ అయిన బియ్యం బ్యాగ్ .. 35 ప్యాకెట్ల మసాలాలు గుర్తించారు. తెలంగాణ వ్యాప్తంగా గత రెండు నెలల్లో మొత్తం 387 హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించగా.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్/రిజిస్ట్రేషన్ లేకుండానే అత్యధిక హాస్టళ్లు పనిచేస్తున్నట్లు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..