Telangana: కడియంపై ప్రేమ కురిపించిన ఎమ్మెల్యే రాజయ్య.. ఇంతలో అంతమార్పేల.. ఆశ్చర్యంలో పార్టీ శ్రేణులు..!
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనానికి సతీసమేతంగా హాజరయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. కాగా, ఆయన సతీమణి భారతి ర్యాలీగా వస్తూ డప్పు వాయించి, కోలాటం కళాకారులతో కోలాటం ఆడుతు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు.

స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనానికి సతీసమేతంగా హాజరయ్యారు ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య. కాగా, ఆయన సతీమణి భారతి ర్యాలీగా వస్తూ డప్పు వాయించి, కోలాటం కళాకారులతో కోలాటం ఆడుతు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు.
అయితే, ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య.. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూ విమర్శలు, ఆగ్రహంతో కామెంట్స్ చేసే ఆయన.. ఈ సారి కాస్త సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని పిలవడం లేదనే అభ్యంతరాలు ఆరోపణలు చేస్తున్నారని, 3 రోజుల ముందే పత్రికా ముఖంగా, సోమవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి సమక్షంలో ఫోన్లో మాట్లాడి ఆహ్వానించానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని నల్లగొండ జిల్లాకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పజెప్పడంతో, ఈ నెల 6వ తేదీ వరకు బిజీగా ఉన్నారని వీలు చూసుకుని వస్తానని కడియం శ్రీహరి తెలిపారని రాజయ్య అన్నారు. ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు మంత్రిగా పనిచేసి, అనేక కార్యక్రమాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి సేవలను నియోజకవర్గానికి వాడుకుంటానని అన్నారు ఎమ్మెల్యే రాజయ్య. స్టేషన్ ఘనాపూర్ డివిజన్ కేంద్రంలో సిరిపురం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్యన కార్యకర్తలు పనిచేస్తున్నారని, వారి మనోభావాలను తెలుసుకునేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను 5వ సారి గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని అన్నారు ఎమ్మెల్సీ.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..