Homeopathy Vijnana Sammelan: హోమియోపతికి అంతర్జాతీయ గుర్తింపునకు చేతులు కలిపిన జీహెచ్ఎఫ్, విఐబిహెచ్ఏ..
హోమియోపతికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్(GHF), విజ్ఞాన భారతి(ViBha) చేతులు కలిపాయి. హోమియోపతిపై భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడానికి దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నాయి.
హోమియోపతికి జాతీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్(GHF), విజ్ఞాన భారతి(ViBha) చేతులు కలిపాయి. హోమియోపతిపై భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడానికి దేశ వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నాయి. గ్లోబల్ హెల్త్ కేర్‌కు భారతీయ హోమియోపతిని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దమే లక్ష్యంగా పేర్కొన్నాయి ఈ సంస్థలు.
ఇందులో భాగంగా ‘హోమియోపతి విజ్ఞాన సమ్మేళనం 2023(HVS)’ పేరుతో మొదటి సమావేశం ఏప్రిల్ 9, 2023న హైదరాబాద్‌లో జరగనుంది. హోమియోపతికి సంబంధించిన కొన్ని భారతీయ దిగ్గజాలకు, ముఖ్యంగా భారతదేశంలో హోమియోపతి పితామహుడు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్‌కు నివాళులు అర్పించనున్నారు. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ ఆసుపత్రి.. కీలకమైన వివిధ విషయాలపై ప్రెజెంటేషన్‌లతో పాటు, గ్లోబల్ మెడికల్ కమ్యూనిటీకి ఉన్న అతిపెద్ద ప్రస్తుత ముప్పు, సవాళ్లు, ఆందోళనలపై తన ఆలోచనలను ఉద్దేశించి పంచుకుంటుంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(AMR) పై హోమియోపతి ప్రభావం ఎలా ఉంటుంది, ఈ సవాళ్లను ఎదుర్కోగలదో, ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి ఒక వరంలా ఎలా ఉంటుందో వివరించనున్నారు.
HVS 2023 చివరి సమావేశం 2024లో కోల్‌కతాలో ఐదు రోజుల జరుగనున్న మెగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కమ్ ఎక్స్‌పోతో ముగుస్తుంది. ఈ కాన్ఫరెన్స్ థీమ్ క్యూరేటివ్, ప్రివెంటివ్, ప్రోమోటివ్ హెల్త్‌లో భారతీయ హోమియోపతి బలాన్ని ఏకీకృతం చేయడంతోపాటు పశువైద్యం, వ్యవసాయ సంరక్షణలో దాని పరిధి.
గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్(GHF)..
GHF – గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, ప్రభుత్వేతర సంస్థ. దీనిని 2014లో స్థాపించడం జరిగింది. హోమియోపతిలో ప్రసిద్ధులైన ఏడుగురు వ్యక్తుల భాగస్వామ్యంతో దీనిని స్థాపించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయంగా మద్ధతులో సంస్థ నడుస్తోంది. అంతేకాదు.. హోమియోపతి ప్రాముఖ్యత, గుర్తింపు కోసం అంతర్జాతీయ సంస్థలైన UN, WHO, UNESCO లతో కలిసి పని చేసే ప్రక్రియలో ఉంది గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్.
విజ్ఞాన భారతి(ViBha)..
విజ్ఞాన భారతి(ViBha).. స్వదేశీ లక్ష్యంతో డైనమిక్ సైన్స్ ఉద్యమం చేపట్టిన సంస్థ. సైన్స్‌ని భారతీయ సంప్రదాయం, సంస్కృతితో అనుసంధానించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తోంది. భౌతిక, ఆధ్యాత్మిక శాస్త్రాల సామరస్య సంశ్లేషణతో భారతీయ వారసత్వాన్ని ఇనుమడింపజేస్తుంది. జాతీయ పునర్నిర్మాణం కోసం శాస్త్ర సాంకేతిక యుగంలో స్వదేశీ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయడం దీని లక్ష్యం.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..