Bandi Sanjay detained: ఉత్తర భారత సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొస్తున్నారు.. బీజేపీ తీరుపై బీఆర్ఎస్ ఫైర్..
Bandi Sanjay detained: తెలంగాణ రాజకీయాల్లో పేపర్ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అనంతరం.. బండి సంజయ్ అరెస్టు కలకలం రేపింది. కాగా.. ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతుంటే.. ఈ లీకేజీకి కారణం బీజేపీనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.

Bandi Sanjay detained: తెలంగాణ రాజకీయాల్లో పేపర్ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ అనంతరం.. బండి సంజయ్ అరెస్టు కలకలం రేపింది. కాగా.. ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడుతుంటే.. ఈ లీకేజీకి కారణం బీజేపీనే అంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. బండి సంజయ్ కావాలనే పేపర్ లీకేజ్ కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ పై గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుటిల రాజకీయాలకు లీకేజీ నిదర్శనం.. కేవలం బీజేపీ గ్రూపులకే పరీక్ష పేపర్లు వెళ్లాయి.. దీనిని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తున్నారంటూ గంగుల కమలాకర్ మండి పడ్డారు. వేలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఉసురు సంజయ్‌కు తగులుతుంది.. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశారు. లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే.. తెలంగాణలో బిహార్ తరహా గుండాయిజం.. రౌడీయిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు..
తెలంగాణను బిహార్ తరహాగా మారుస్తారేమోనని భయం వేస్తోంది.. అన్నింటికీ కరీంనగరే వేదిక అవుతోంది.. అంటూ గంగుల మండిపడ్డారు. యువతను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ లీకేజీలకు పాల్పడుతోంది.. నిరుద్యోగులకు ఉపాధి రాకుండా బీజేపీ జెండా పట్టుకు తిరగాలనే కుట్ర చేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ హిందూ, ముస్లింలకు గొడవలు పెట్టేది.. ఇప్పుడు బీజేపీ నీచాతినీచంగా ప్రవర్తిస్తుంది.. ఉత్తర భారత సంస్కృతిని తెలంగాణలోకి తీసుకొస్తున్నారంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు.
బీజేపీ నేతల కుట్ర




కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల మనసు గెల్చుకోలేరన్నారు. లీకేజీలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వాళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ప్రజలు అన్ని గమనిస్తున్నారు, చెప్పులతో కొడతారు.. బీజేపీ ఈడీ, ఐటీ దాడులతో బెదిరింపులకి దిగుతోందంటూ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..