బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారుః మంత్రి పొన్నం ప్రభాకర్
ఓట్ చోరీ వివాదంపై బీఆర్‌ఎస్ కామెంట్స్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ అనేది అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు సహజంగానే 10 నుంచి 12వేల కొత్త ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయని మంత్రి తెలిపారు.

ఓట్ చోరీ వివాదంపై బీఆర్‌ఎస్ కామెంట్స్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ అనేది అవాస్తవమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు సహజంగానే 10 నుంచి 12వేల కొత్త ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తాము వ్యక్తిగత కామెంట్స్ చేయడం లేదని.. కానీ, వేదికలపై ఆమెను కేటీఆర్, హరీష్‌లు ఏడిపిస్తున్నారని మాత్రమే చెప్పామన్నారు. ఏ ఎన్నికైనా తమకు రిఫరెండమే అన్న మంత్రి పొన్నం.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ, ఓట్ చోరీ అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళలను అవమానించడం కొత్తేం కాదని విమర్శించారు. అయితే మాగంటి సునీతపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాగంటి సునీతపై తమకు సానుభూతి ఉందని చెప్పారు. ప్రతి విషయాన్నీ బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
