జూబ్లీహిల్స్‌కు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదు.. అభివృద్ధిపై యూసుఫ్‌గూడ చౌరస్తాలో చర్చకు సిద్ధంః పొన్నం
జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేశామో చెప్పుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందుకే వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవా మంత్రి పొన్నం విసిరారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశామో చెప్పుకునే స్థితిలో బీఆర్ఎస్ లేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అందుకే వివిధ అంశాలను తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవా మంత్రి పొన్నం విసిరారు. దీనిపై యూసుఫ్‌గూడ చౌరస్తాలో చర్చించేందుకు తాము సిద్ధమన్నారు.
టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లుగా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి శూన్యమని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే , జూబ్లీహిల్స్‌లోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామన్నారు. సానుభూతి ఓట్ల కోసం బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. ఓటు చోరీపై మొదట రాహుల్ గాంధీ గళం విప్పారన్న పొన్నం, ఓటు చోరీపై బీఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరమన్నారు. జూబ్లీహిల్స్‌కు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్న మంత్రి, నియోజకవర్గ అభివృద్ధిపై యూసుఫ్‌గూడ్ చౌరస్తాలో చర్చకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
