Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు అదే చివరి రోజు.. మంత్రి సంచలన ప్రకటన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Telangana: ప్రజలకు బిగ్ అలర్ట్.. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు అదే చివరి రోజు.. మంత్రి సంచలన ప్రకటన
Praja Palana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 02, 2024 | 5:43 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. క్షేత్ర స్థాయిలో అధికారులు ప్రజల నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. జనవరి 6 వరకు ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ తర్వాత కూడా దరఖాస్తులను మండల కేంద్రాల్లో ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా పాలన దరఖాస్తుల గడువుపై సంచలన ప్రకటన చేశారు. ప్రజా పాలన దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 6నే చివరి రోజంటూ పేర్కొన్నారు. జనవరి 6 వరకే గ్రామాల్లో శిబిరాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ గడువు పొడిగింపు ఉండదంటూ పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. అయితే, జనవరి ఆరు తర్వాత మండల కేంద్రాల్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. మంగళవారం మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసన్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారంటూ ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని.. కేసీఆర్ ను రక్షించేందుకే బీజేపీ సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. జ్యుడీషియల్ విచారణకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయ శాఖ.. సుప్రీం, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని కోరారు.

బీఆర్ఎస్ కు బీజేపీకి దోస్తీ ఉందన్నారు. గోషామాహాల్ లో ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు, జూబ్లీహిల్స్ లో అజారుద్దీన్ పై ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. ఇప్పటికీ బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకునే పరిస్థితి లేదన్నారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని నియమించకుంటే.. తమ లేఖకు విలువ లేకుంటే కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీది, బిఆర్ఎస్ ది అపవిత్ర కలయిక అన్నారు. వాళ్ళు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు తిట్టుకుంటారో తెలియదు.

తెలంగాణ ప్రజల విషయంలో కేసీఆర్ కుటుంబం అనేక తప్పులు చేసిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు సోకులకు కాదు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమేనన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే రాష్ట్రంలో సిబిఐ పై బ్యాన్ ఎత్తివేస్తామన్నారు. ట్రక్ డ్రైవర్లు దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రవాణా చట్టంను కొంతకాలం నిలిపివేయాలని కోరారు. ట్రక్ యజమానుల సమ్మె పై కేంద్రం వెంటనే చర్చలు జరిపాలన్నారు.

ఆటో డ్రైవర్లు బిఆర్ఎస్ ట్రాప్ లో పడొద్దంటూ పొన్నం ప్రభాకర్ కోరారు. ఓలా, ఉబర్, ర్యాపిడో, మెట్రో ఇతరత్రా అన్ని వచ్చినప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా? అయినా వారి సమస్యలను పరిష్కరిస్తామంటూ పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వ్యతిరేకిస్తున్నారా? బిఆర్ఎస్ స్పష్టం చేయాలన్నారు. ఆటో డ్రైవర్లతో చర్చలకు తాము సిద్ధమంటూ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..