5

క్యూ లైన్‌లో రైతు చనిపోతే తప్పెవరిదిః మంత్రి నిరంజన్‌రెడ్డి

దుబ్బాకలో యూరియా కోసం రైతు క్యూలైన్లో నిలబడి చనిపోయిన ఘటనపై స్పందించిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి క్యూలైన్లో నిలబడిన రైతు చనిపోతే తప్పు ప్రభుత్వానిదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో నిలబడి చనిపోతే తప్పు సినిమా వాళ్లదా? సభకెళ్ళి చనిపోతే సభను నిర్వహించిన వారిది తప్పంటామా? కానీ ఇక్కడ కొందరు పనిగట్టుకొని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారన్నారు. వరదలు, వర్షాల కారణంగా యూరియా రవాణా ఆలస్యమైందని, రాష్ట్రంలో ఎక్కడ కొరత లేదన్నారు. గిట్టనివాళ్ళు ప్రభుత్వం మీద […]

క్యూ లైన్‌లో రైతు చనిపోతే తప్పెవరిదిః మంత్రి నిరంజన్‌రెడ్డి
Follow us

|

Updated on: Sep 05, 2019 | 9:00 PM

దుబ్బాకలో యూరియా కోసం రైతు క్యూలైన్లో నిలబడి చనిపోయిన ఘటనపై స్పందించిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి క్యూలైన్లో నిలబడిన రైతు చనిపోతే తప్పు ప్రభుత్వానిదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో నిలబడి చనిపోతే తప్పు సినిమా వాళ్లదా? సభకెళ్ళి చనిపోతే సభను నిర్వహించిన వారిది తప్పంటామా? కానీ ఇక్కడ కొందరు పనిగట్టుకొని ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారన్నారు. వరదలు, వర్షాల కారణంగా యూరియా రవాణా ఆలస్యమైందని, రాష్ట్రంలో ఎక్కడ కొరత లేదన్నారు. గిట్టనివాళ్ళు ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు ప్రయత్నాలలో భాగమేనని కొట్టిపారేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చు మాయి పల్లి  గ్రామానికి చెందినరైతు ఎల్లయ్య యూరియా కోసం  వ్యవసాయ సహకార సంఘం వద్ద క్యూలైన్లో వేచి ఉండి హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.