Minister KTR: బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ట్వీట్..

Minister KTR Tweets: నూపుర్‌ శర్మను సస్పెండ్‌ చేసిన బీజేపీ హైకమాండ్‌ మసీదులను తవ్వుతానన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప‌్రశ్నించారు. మసీదులను తవ్వుతామని , ఉర్ధూను బ్యాన్‌ చేస్తామన్న..

Minister KTR: బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్ చేయలేదు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ ట్వీట్..
Telangana Minister KTR
Follow us

|

Updated on: Jun 05, 2022 | 6:44 PM

అన్ని మతాలను సమదృష్టితో చూస్తామని బీజేపీ(BJP) చేసిన ప్రకటనపై స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌(KTR). నూపుర్‌ శర్మను(Nupur Sharma) సస్పెండ్‌ చేసిన బీజేపీ హైకమాండ్‌ మసీదులను తవ్వుతానన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప‌్రశ్నించారు. మసీదులను తవ్వుతామని , ఉర్ధూను బ్యాన్‌ చేస్తామన్న బండి సంజయ్‌ను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. మహ్మాద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను బీజేపీ హైకమాండ్‌ సస్పెండ్‌ చేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి నూపుర్‌ను బహిష్కరించారు. నూపుర్‌శర్మతో పాటు నవీన్‌జిందాల్‌ ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా దేశంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నూపుర్‌శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ కాన్పూర్‌లో చేపట్టిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. నూపుర్‌శర్మపై ముంబైతో పాటు పలు పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని అంటున్నారు నూపుర్‌శర్మ. తనను చంపేస్తామని వేలాదిఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని ఢిల్లీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు

ఓ టీవీషో డిబేట్‌లో నూపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలపై చిచ్చు చెలరేగింది. మహ్మద్‌ ప్రవక్తపై చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్టు ముస్లిం సంఘాలు ఆమెపై మండిపడుతున్నాయి. అయితే నూపుర్‌శర్మ వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. అన్ని మతాలను సమదృష్టితో తమ పార్టీ చూస్తుందని స్పష్టం చేసింది. మహ్మద్‌ ప్రవక్తపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటునట్టు ట్వీట్‌ చేశారు నూపుర్‌ శర్మ.