KTR: కరెంట్ కష్టాలు.. తాగునీటి తిప్పలు లేవు.. దేశానికే తెలంగాణ ఆదర్శం.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్..
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం దిక్సూచిలా మారిందని వివరించారు. తెలంగాణలో ఏ రంగాన్నీ..

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం దిక్సూచిలా మారిందని వివరించారు. తెలంగాణలో ఏ రంగాన్నీ విస్మరించలేదన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై.. శాసనసభలో జరిగిన చర్చ ముగియడంతో మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడిని ఆకర్షించడంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేటీఆర్ వివరించారు. రైతుబంధు పథకం ద్వారా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సైతం రైతు బంధును ప్రశంసించిందన్నారు. దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ ఎదిగింది. సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేదు. తెలంగాణలో కరెంట్ కష్టాలు, తాగునీటి తిప్పులు లేవని స్పష్టం చేశారు.
కేసీఆర్ అధికారంలోకి రాకముందు విద్యుత్ ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో ఓసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నియమాకాల కల సాకారమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 9 తెలంగాణలోనే ఉన్నాయి. దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల ద్వారా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కానీ తెలంగాణ మాత్రం రైతుల సంక్షేమానికే ఎక్కువ కృషి చేస్తోంది.
– కేటీఆర్, తెలంగాణ ఐటీ మినిస్టర్




మరోవైపు.. ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన విమర్శలను కేటీఆర్ ఖండించారు. రఘునందన్ రావు మాట్లాడిన మాటలు కేంద్రానికి వత్తాసు పలికేలా ఉన్నాయని మండిపడ్డారు. అంగన్వాడీ ఉద్యోగులకు అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. దేశానికి తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది’’ అని కేటీఆర్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..