AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: తెలంగాణ ప్రజల కల ఇది.. ఆ రోజున సంబరాలు చేసుకోవాలి.. గర్వపడుతున్నానంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Palamuru Rangareddy Lift Irrigation Project: ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది.. అంటూ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు.

Minister KTR: తెలంగాణ ప్రజల కల ఇది.. ఆ రోజున సంబరాలు చేసుకోవాలి.. గర్వపడుతున్నానంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR - Minister KTR
Shaik Madar Saheb
|

Updated on: Sep 09, 2023 | 9:13 PM

Share

Palamuru Rangareddy Lift Irrigation Project: ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది.. అంటూ మంత్రి కే తారక రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఈనెల 16వ తారీఖున ప్రారంభించనుంది. లక్షన్నర మంది రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధిపతులు, పూర్వ జిల్లా కలెక్టర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వలసల జిల్లాలో ఒకనాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పచ్చగా చేస్తుందంటూ పేర్కొన్నారు.

గోదావరిలో కాలేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టిందని కేటీఆర్ వివరించారు. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు.. సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుందని పేర్కొ్న్నారు.

ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి అని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇదన్నారు. అనేక అడ్డంకులను దాటుకుని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. 16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

కనీసం లక్షన్నర మంది రైతులతో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించిన మంత్రి కేటీఆర్ పలు సలహాలు, సూచనలు చేశారు. మంత్రులు, అధికారులు, సంబంధిత ఎమ్మెల్యేలతో సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..