KTR in Telangana Investment Meet: పెట్టుబడులతో రండి.. రెడ్‌ కార్పెట్‌తో వెలకమ్‌ చెబుతాం.. ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో మంత్రి కేటీఆర్‌

ప్రపంచ దేశాల‌ు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.

KTR in Telangana Investment Meet: పెట్టుబడులతో రండి.. రెడ్‌ కార్పెట్‌తో వెలకమ్‌ చెబుతాం.. ఇన్వెస్ట్‌మెంట్‌ మీట్‌లో మంత్రి కేటీఆర్‌
Ktr Inaugural Address At The Telangana Investment Meet
Follow us

|

Updated on: Jun 14, 2021 | 8:42 PM

Minister KTR in Telangana Investment Meet: ప్రపంచ దేశాల‌ు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. సౌదీ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన రెండు రోజులు జరిగే తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ లో కేటీఆర్ పాల్గొని ప్రారంభ ఉప‌న్యాసం చేశారు.

ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ అనువైన ప్రాంతమని మంత్రి కేటీఆర్‌. సౌదీ, భారత ఎంబసీ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్‌లో పాల్గొన్న కేటీఆర్.. ఏడేళ్లలో జరిగిన రాష్ట్ర ప్రగతిని వివరించారు. ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించగలిగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ పేరిట 2 రోజుల సదస్సు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సౌదీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. సౌదీ కంపెనీలతోపాటు సౌదీఇండియా బిజినెస్ కౌన్సిల్ పాల్గొంది.

టీఎస్-ఐపాస్‌తో ద్వారా పరిశ్రమల ఏర్పాటు సరళీకృతం చేశామన్న కేటీఆర్.. ఇప్పటివరకు సుమారు 22బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామన్నారు. దాదాపు1.5 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పలు రంగాలను ఎంచుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సౌదీ కంపెనీలకు సహకారం అందిస్తామన్నారు. అరబ్ దేశాలతో అవినాభావ సంబంధం ఉందని.. లక్షల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మీట్‌ను ఏర్పాటు చేసిన సౌదీ రాయబారి అసఫ్ సయీద్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

దేశంలోనే నూతన రాష్ట్రమైనప్పటికీ గత ఐదేళ్లుగా తెలంగాణ అద్భుతమైన పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని భారత రాయబారి అశోక్ సయూద్ తెలిపారు. తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ ద్వారా పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్రారంభ సెషన్ కార్యక్రమంలో సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అల్ ఖతానీ, సౌదీ ప్రభుత్వానికి చెందిన మహమ్మద్ అల్ హస్నా, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, నీతి అయోగ్‌కి చెందిన అడిషనల్ సెక్రటరీ రాకేష్ సర్వాల్ పాల్గొన్నారు.

Read Also…  Police Busted Red Sandalwood Dump: తీగ లాగితే ఎర్ర చందనం డంక కదిలింది.. 27 దుంగలు స్వాధీనం.. నలుగురు అరెస్ట్!

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో