AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konda Surekha: అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్.. నాగార్జునతో వివాదంపై ఏమన్నారంటే..?..

కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా నాగచైతన్య-సమంత విడాకులను ప్రస్తావించి వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఇప్పటికే నాగార్జున వేసిన పరువు నష్టం దావా కోర్టులో నడుస్తుండగా... అర్ధరాత్రి ఆమె సంచలన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్‌తో ఈ వివాదం ముగుస్తుందా..? లేదా..? అసలు ఆ ట్వీట్ ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం

Konda Surekha: అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్.. నాగార్జునతో వివాదంపై ఏమన్నారంటే..?..
Minister Konda Surekha Tweet
Krishna S
|

Updated on: Nov 12, 2025 | 7:35 AM

Share

మంత్రి కొండా సురేఖ – అక్కినేని నాగార్జున వివాదం ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేయగా.. ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో మంత్రి అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చనీయాంశమైంది.

నాకు ఆ ఉద్దేశం లేదు..

అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొండా సురేఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే, అందుకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

వివాదానికి కారణం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేసే సమయంలో మంత్రి కొండా సురేఖ నాగచైతన్య – సమంత విడాకులను ప్రస్తావించారు. కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ క్షమాపణను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది, పరువు నష్టం దావాపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..